ముచ్చటగా మూడోసారి ఆ బ్యానర్లో సినిమా చేయనున్న శేఖర్ కమ్ముల..?

Pulgam Srinivas
సినిమా ఇండస్ట్రీ లో కొంత మంది కి మంచి స్నేహం ఉంటూ ఉంటుంది. దానితో వారితోనే సినిమాలను రిపీట్ చేస్తూ వస్తూ ఉంటారు. అలాంటి వారిలో దర్శకుడు శేఖర్ కమ్ముల మరియు నిర్మాత ఏషియన్ సునీల్ కూడా ఉన్నారు. శేఖర్ మొదటగా ఏషియన్ సినిమా సంస్థ నిర్మించిన లవ్ స్టోరీ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో నాగ చైతన్య హీరో గా నటించగా ... సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇకపోతే ఈ సినిమా విడుదల అయ్యి మంచి విజయం సాధించగానే వీరి కాంబోలో మరో మూవీ కూడా ఉండబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది.


కానీ శేఖర్ మాత్రం ఈ సినిమా స్టోరీ పై చాలా రోజులు పని చేసి ఫైనల్ అవుట్ పుట్ సూపర్ గా వచ్చిన తర్వాత ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేశాడు. ఇకపోతే శేఖర్ ... ఏషియన్ సంస్థ కాంబోలో ప్రస్తుతం ధనుష్ , నాగార్జున హీరోలుగా రష్మిక మందన హీరోయిన్ గా ఓ మూవీ రూపొందుతుంది. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. ఇకపోతే ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉండగానే శేఖర్ కమ్ముల మరోసారి ఏషియన్ సినిమా సంస్థ లో మరో మూవీ చేయబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.


ఇకపోతే ఇప్పటికే ఇందుకు గాను శేఖర్ కూడా వారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న సినిమా షూటింగ్ పూర్తి కాగానే ఈ మూవీ కి సంబంధించిన పనులను శేఖర్ మొదలు పెట్టబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇకపోతే ధనుష్  నాగార్జున , శేఖర్ కమ్ముల కాంబో లో రూపొందుతున్న సినిమాకి టైటిల్ ను మరికొన్ని రోజుల్లోనే ఈ చిత్ర బృందం విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: