బ్రహ్మానందం ఆస్తులు విలువ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!?

Anilkumar
తెరపై ఆయన కనిపిస్తే చాలు పొట్టలు చెక్కలయ్యేలా నవ్వుకుంటూ ఉంటారు. ఆయన ఒక్కసారి తెరపై ఎంట్రీ ఇస్తే చాలు నవ్వులు హరివిల్లులాగా పూస్తాయి. అసలు కామెడీ అంటేనే ఆయన అనేంత లాగా కామెడీ టైమింగ్ సెట్ చేశారు ఆయన. కేవలం ఆయన మాట్లాడితేనే చాలు నవ్వు ఆగదు. అంతేకాదు కేవలం ఆయన కామెడీ వల్లే కొన్ని వందల సినిమాలు హిట్ అయ్యాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన నవ్విన నవ్వించిన ఏడ్చినా కూడా అది కామెడీ లాగానే ఉంటుంది. అందుకే దర్శక నిర్మాతలు ఏరి కోరి మరి ఆయనను సినిమాలోకి పెట్టుకోవడానికి చూస్తూ ఉంటారు. అంతేకాదు ఆయన కోసమే ప్రత్యేకంగా పాత్రలను డిజైన్ చేస్తూ ఉంటారు.

 సాధారణంగా ఏ కమీడియన్లను అయినా సరే కామెడీ కోసం మాత్రమే సినిమాల్లోకి తీసుకుంటారు. కానీ బ్రహ్మానందాన్ని మాత్రం సినిమా హిట్ కోసం తీసుకుంటారు అని చెప్పొచ్చు. బ్రహ్మానందం బహుముఖ ప్రజ్ఞాశాలి. ఎలాంటి పాత్రకు అయినా ప్రాణం పోసేంతగా నటిస్తుంటారు. ఆయన ఒక పాత్ర చేశారంటే ఆ పాత్ర మాత్రమే మనకు గుర్తుకు వస్తుంది తప్ప.. అందులో బ్రహ్మానందం మనకు ఎక్కడా కనపించడు. ఆయన కేవలం కమెడియన్ గానే కాకుండా థియేటర్, మిమిక్రీ ఆర్టిస్ట్ గాను, అలాగే రచయిత, చిత్రకారుడుగాను రాణించాడు. ఆయన దాదాపు వెయ్యికి పైగా సినిమాల్లో నటించి ఆస్తులు కూడా బాగానే కూడబెట్టుకున్నాడు.

ఆయనకు జూబ్లీహిల్స్ లో ఓ లగ్జరీ ఇల్లు ఉంది. దాంతో పాటు హైదరాబాద్ శివార్లలో రెండు గెస్ట్ హౌస్ లు కూడా ఉన్నాయి. ఆయన మొదటి నుంచి తన సంపాదన మొత్తం రియల్ ఎస్టేట్ లో పెడుతూ వచ్చాడు. అలా దాదాపు కొన్ని వందల ఎకరాలు కొన్నాడు. దాంతో పాటు ఆయనకు చాలా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాడు. దాంతో ఆయన ఆస్తులు వందల కోట్లకు చేరుకున్నాయి. ఇక బ్రహ్మానందంకు ఆడీ క్యూ 7, ఆడీ క్యూ 8, బెంజ్ కార్లు ఉన్నాయి. ప్రస్తుతం బ్రహ్మానందం ఆస్తుల విలువ మొత్తం రూ.500 కోట్లకు పై చిలుకు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: