నైజాం ఏరియాలో.. భారీ ఫీట్ సాధించేందుకు సిద్ధమైన హనుమాన్?

praveen
ఇటీవల కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో ఎలాంటి అంచనాల లేకుండా విడుదలైన సినిమాలు సూపర్ డూపర్ విజయాన్ని సాధిస్తున్నాయ్ అన్న విషయం తెలిసిందే. కొత్త దర్శకులు కొత్త కథలతో వస్తూ ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అవుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే చిన్న సినిమాలు పెద్ద విజయాలు సాధిస్తుంటే భారీ బడ్జెట్ తో వచ్చిన సినిమాలు మాత్రం ఎందుకో పెద్దగా సక్సెస్ కాలేకపోతూ ఉండడం కూడా నేటి రోజుల్లో చూస్తూ ఉన్నాం. అయితే ఇక ఇటీవల సంక్రాంతి బలిలో నిలిచిన హనుమాన్ విషయంలో కూడా ఇదే జరిగింది.

 అప్పటికే సంక్రాంతి బరిలో వెంకటేష్, నాగార్జున, మహేష్ బాబు లాంటి టాప్ హీరోలందరూ కూడా తమ సినిమాలను నిలిపేందుకు సిద్ధమయ్యారు. ఇలాంటి సమయంలో తేజ సజ్జ అనే చిన్న హీరో నటించిన హనుమాన్ మూవీ విడుదలైంది. అయితే ఓవర్ కాన్ఫిడెన్స్ కాకపోతే సంక్రాంతికి రిలీజ్ చేయడం అవసరమా అని ఎంతో మంది విమర్శలు చేశారు. కానీ ప్రశాంత్ వర్మ తన దర్శకత్వ ప్రతిభతో అందరిని మెప్పించ గలిగాడు. ఇక ఈ సంక్రాంతికి హీరోగా కూడా మారిపోయాడు అని చెప్పాలి. చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని సాధించింది హనుమాన్.

 జనవరి 12వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ మూవీ తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా అందరి అంచనాలను అధిగమించింది. ఈ సినిమాకు ఇప్పటికీ కూడా భారీగా వస్తువులు వస్తున్నాయి అని చెప్పాలి  అయితే టాలీవుడ్ సినిమాలు ఏది విడుదలైన నైజంలో కలెక్షన్స్ ఎంతవరకు రాబట్టాయ్ అని చూస్తూ ఉంటారు. అయితే ఇక ఇప్పుడు హనుమాన్ సినిమా నైజాం రీజియన్ లో  సృష్టించేందుకు సిద్ధమవుతుంది. ఇప్పటికే ఈ మూవీ 28.5 కోట్ల షేర్ వసూలు చేసింది. 1 50  కోట్లు షేర్ వసూలు చేస్తే నైజాం ఏరియాలో 30 కోట్ల షేర్ వసూలు చేసిన సినిమాగా హనుమాన్ రికార్డు సృష్టిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: