విశ్వంభర మూవీని.. మెగాస్టార్ ఆ హీరో నుంచి లాగేసుకున్నాడా?

praveen
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి 60 ప్లస్ దాటిపోతున్న ఇంకా యంగ్ హీరోలకు పోటీగా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు అన్న విషయం తెలిసిందే. హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా ఇక ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తూనే ఉన్నాడు. కాగా ప్రస్తుతం మెగాస్టార్ కెరియర్ లో ప్రతిష్టాత్మకంగా తెరకేక్కుతున్న మూవీ విశ్వంభరా. టాలెంటెడ్ డైరెక్టర్ వశిష్ట ఈ మూవీకి దర్శకత్వం వహిస్తూ ఉన్నాడు. గతంలో బింబిసారా అనే సినిమాను తీసి ఇక సూపర్ హిట్ దక్కించుకున్నాడు ఈ డైరెక్టర్. ఇక ఈ సినిమాపై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే.

 సోషియో ఫాంటసీ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతూ ఉండడం గమానార్హం. అయితే ఈ మూవీలో ఏకంగా ఐదుగురు హీరోయిన్స్ తో కలిసి నటించబోతున్నాడట మెగాస్టార్ చిరంజీవి  అయితే చాలాకాలం నుంచి చిరంజీవిని సినిమాలో డ్యూయల్ రోల్ లో చూడాలి అనే కోరిక అభిమానులకు అలాగే ఉండిపోయింది. అయితే ఇక ఈ మూవీలో ఆ కోరిక తీరబోతుందట  అంతేకాదు 60 ప్లస్ వయసులో కూడా చిరంజీవి ఇంకా ఒరిజినల్ గా ఈ సినిమా కోసం స్టంట్స్ చేయడానికి రెడీ అయ్యాడు అంటూ ప్రచారం జరుగుతుంది.

 అయితే ఇప్పుడు విశ్వంభరా సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారిపోయింది. ఏకంగా మరో హీరో నుంచి మెగాస్టార్ చిరంజీవి విశ్వంభరా సినిమాను లాగేసుకున్నాడట. ఈ కథను నందమూరి బాలకృష్ణతో తెరకెక్కించాలని అనుకున్నాడట డైరెక్టర్ వశిష్ట. ఆయనకే కథ కూడా వినిపించాడట. అయితే బాలకృష్ణ అప్పటికే వేరే ప్రాజెక్టుతో బిజీ బిజీగా ఉన్నాడు  ఈలోపే వశిష్ట కథను చిరంజీవి దగ్గరికి తీసుకువెళ్లాడట. అప్పటికే బాలయ్యకు వశిష్ట తనకంటే ముందు కథ వినిపించాడని చిరంజీవికి తెలిసిందట. అయినా సరే కథ బాగుంది నువ్వు ఓకే అంటే సినిమా షూట్ ప్రారంభిద్దామని వశిష్టకు చెప్పాడట. అయితే ఇక ఈ సినిమా కోసం ఏకంగా మారుతితో చేయాల్సిన సినిమాను కూడా పక్కన పెట్టాడట చిరంజీవి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: