ఆ పాకిస్తాన్ ప్లేయర్ నా ఫేవరెట్.. బాలీవుడ్ స్టార్ షాకింగ్ కామెంట్స్?

praveen
ఇండియాలో క్రికెట్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాధారణ ప్రేక్షకుల దగ్గర నుంచి సినీ సెలబ్రిటీలు  రాజకీయ నాయకుల వరకు ప్రతి ఒక్కరు కూడా క్రికెట్ ని ఎంతగానో ఆరాధిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే చాలు ఏకంగా టీవీలకు అతుక్కుపోయి కన్నా అర్పకుండా మ్యాచ్ వీక్షిస్తూ ఉంటారు. ఇక ఆ రేంజ్ లో క్రేజ్ ఉంది కాబట్టి ఇక క్రికెటర్లకు సంబంధించిన ఏదైనా విషయం తెరమీదకి వచ్చింది అంటే చాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటుంది.

 అయితే చాలామంది సినీ సెలబ్రిటీలు అటు భారత క్రికెట్లో స్టార్ ప్లేయర్లుగా కొనసాగుతున్న ఎంతోమంది ఆటగాళ్లను అభిమానించడం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఏదైనా కార్యక్రమానికి హాజరైనప్పుడు మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు అంటే ఎవరో ఒక భారత క్రికెటర్ పేరు చెప్పడం చూస్తూ ఉంటాం. ఇటీవల ఒక బాలీవుడ్ నటుడు మాత్రం ఏకంగా మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు అని అడగగానే పాకిస్తాన్ క్రికెటర్ పేరు చెప్పాడు. ఇది కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు అందరూ కూడా భారత క్రికెటర్లను అభిమానిస్తుంటే అటు భారతీయుడైన ఒక బాలీవుడ్ సెలబ్రిటీ మాత్రం పాకిస్తాన్ క్రికెటర్ తన ఫేవరెట్ అంటూ చెప్పాడు.

 ఇలాంటి షాకింగ్ కామెంట్స్ చేసిన సినీ సెలబ్రిటీ ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ పాకిస్తాన్ మాజీ ఫేసర్ వసీం అక్రమ్ పై ప్రశంసలు కురిపించాడు. గొప్ప క్రికెటర్లలో అక్రమ్ కూడా ఒకరూ. అతడి రివర్స్ స్వింగ్ తో బ్యాటర్లను భయపెట్టేలా ఉంటుంది. నా జీవితంలో నేను చూసిన గొప్ప ప్లేయర్ వసీం బాయ్ అంటూ కామెంట్ చేశాడు. దుబాయిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఇలా పాకిస్తాన్ క్రికెటర్ పై ప్రశంసలు కురిపించాడు. అయితే ఈ కార్యక్రమంలో అటు ఒక్క భారత క్రికెటర్ గురించి కూడా ప్రస్తావించకపోవడంతో టీమిండియా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: