బాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి హృతిక్ రోషన్ తాజాగా ఫైటర్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించగా ... సిద్ధార్థ్ ఆనంద్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ సినిమా భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా ఈ సంవత్సరం జనవరి 25 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది.
దానితో ఈ మూవీ ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను వరల్డ్ వైడ్ గా రాబడుతుంది. ఇకపోతే ఈ సినిమా ఓ వైపు దియేటర్ లలో విజయవంతంగా ప్రదర్శించబడుతున్న సమయం లోనే ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజ్ న్యూస్ సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది.
అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ఒకటి అయినటువంటి నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ ధరకు దక్కించుకున్నట్లు అందులో భాగంగా ఈ మూవీ యొక్క కొన్ని వారాల థియేటర్ రన్ ముగిసిన తర్వాత ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ సంస్థ వారు తమ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ మూవీ లోని హృతిక్ రోషన్ , దీపికా నటనకి గాను ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి వీరిద్దరికీ మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. అలాగే ఈ మూవీ ని రూపొందించిన విధానానికి గాని ఈ సినిమా దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ కు కూడా మంచి ప్రశంసలు జనాల నుండి లభిస్తున్నాయి.