"నా సామి రంగ" లోని ఆ సూపర్ హిట్ సాంగ్ విడుదల..!

Pulgam Srinivas
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తాజాగా నా సామి రంగా అనే విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ కి ప్రముఖ డాన్స్ కొరియో గ్రాఫర్ అయినటువంటి విజయ్ బిన్నీ దర్శకత్వం వహించాడు. ఈయన ఈ సినిమాతోనే దర్శకుడిగా తన కెరియర్ ను మొదలు పెట్టాడు. ఇకపోతే ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ బ్యూటీ అశిక రంగనాథ్ , నాగార్జున కు జోడి గా నటించగా ... ఈ మూవీ లో అల్లరి నరేష్ , రాజ్ తరుణ్ కీలక పాత్రలలో నటించారు. ఈ మూవీ కి ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి సంగీతం అందించాడు. ఈ మూవీ ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీన విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ ను తెచ్చుకొని మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదలకు ముందే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని పాటలను విడుదల చేసింది.
 


ఆ పాటలలో "ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తుంది" అంటూ సాగే పాటకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇకపోతే సినిమా విడుదల అయిన తర్వాత ఈ మూవీ లోని ఈ వీడియో సాంగ్ కి కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇలా ఆడియో గాను ... వీడియో గాను రెండింటి లోనూ మంచి రెస్పాన్స్ ను తెచ్చుకున్న ఈ సినిమా లోని ఈ వీడియో సాంగ్ ను తాజాగా ఈ మూవీ బృందం యూట్యూబ్ లో విడుదల చేసింది. మరి ఈ వీడియో సాంగ్ కి ప్రేక్షకుల నుండి స్థాయి రెస్పాన్స్ లభిస్తుంది అనే విషయం తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇది ఇలా ఉంటే నాగార్జున ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ.లో తమిళ నటుడు ధనుష్ హీరో గా కనిపించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: