హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర అత్యధిక కలెక్షన్లను వాసులు చేసిన టాప్ 10 మూవీస్ ఇవే..!

Pulgam Srinivas
ఈ మధ్య కాలంలో మన తెలుగు సినిమాలు హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్ లను రాబడుతున్నాయి. అందులో భాగంగా ఇప్పటి వరకు హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర అత్యధిక కలెక్షన్ లను సాధించిన టాప్ 10 మూవీ లు ఏవో తెలుసుకుందాం.

ప్రభాస్ హీరో గా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి 2 సినిమా హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర 512 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసి మొదటి స్థానంలో నిలవగా ... రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన "ఆర్ ఆర్ ఆర్" సినిమా 277 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసి రెండవ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ప్రభాస్ హీరోగా రూపొందిన సలార్ సినిమా 153 కోట్ల కలెక్షన్ లతో మూడవ స్థానంలోనూ ... సాహో సినిమా 147 కోట్ల కలెక్షన్ లతో నాలుగవ స్థానంలోనూ ... బాహుబలి సినిమా 119 కోట్ల కలెక్షన్ లతో 5 వ స్థానం లోనూ నిలిచింది.


ఇక ఆ తర్వాత అల్లు అర్జున్ హీరో గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందినటువంటి పుష్ప పార్ట్ 1 మూవీ 108 కోట్ల కలెక్షన్ లతో ఆరవ స్థానంలో నిలిచింది. ఇకపోతే తాజాగా ఈ సంవత్సరం జనవరి 12 వ తేదీన తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన హనుమాన్ సినిమా విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ఇప్పటికి కూడా విజయవంతంగా థియేటర్ లలో ప్రదర్శించబడుతుంది. ఇకపోతే ఈ సినిమా ఇప్పటికే 44.5 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసి ఏడవ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత కార్తికేయ 2 సినిమా 34 కోట్లతో ఎనిమిదవ స్థానంలోనూ ... రాధే శ్యామ్ సినిమా 22.25 కోట్ల కలెక్షన్ లతో 9 వ స్థానం లోనూ ... లైగర్ సినిమా 21.2 కోట్ల కలెక్షన్ లతో పదవ స్థానంలో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: