పర్సనల్ గా.. విజయ్ నాకు ఎంతో సపోర్ట్ చేశాడు : రష్మిక

praveen
ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరోలలో విజయ్ దేవరకొండ కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు చిన్నచితకా పాత్రలు మాత్రమే చేసుకుంటూ ప్రేక్షకులకు పరిచయమైన విజయ్ దేవరకొండ.. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా అవతారం ఎత్తాడు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషన్ సృష్టించాడు అని చెప్పాలి. ఇక గీత గోవిందం అనే మూవీతో వరుసగా బ్లాక్బస్టర్లు కొట్టి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయాడు.

 అయితే విజయ్ దేవరకొండ గీతగోవిందం మూవీ ఏ ముహూర్తాన చేశాడో గానీ.. ఈ మూవీలో హీరోయిన్గా నటించిన రష్మిక మందన్న తో విజయ్ ప్రేమాయణం నడిపిస్తున్నాడు అంటూ ఎన్నో వార్తలు హల్చల్ చేస్తూనే ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇక వీరిద్దరూ కలిసి మాల్దీవ్స్ కి వెకేషన్ కు వెళ్లడం.. చాలా చోట్ల కలిసి కనిపించడంతో వీరి ప్రేమాయడానికి సంబంధించిన వార్తలకు మరింత బలం చేకూరింది. ఇక ఈ జంట పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఎప్పుడూ ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూనే ఉంటాయి. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక  విజయ్ దేవరకొండ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

తాను నటించిన సహానటుల గురించి మాట్లాడుతూ.. బిగ్ బి అమితాబచ్చన్ వయసుతో తేడా లేకుండా అందరిని ఒకేలా గౌరవిస్తారు అంటూ చెప్పుకొచ్చింది. అయితే తాను చేసే పనిలో విజయ్ దేవరకొండ సహకారం ఉంటుంది అంటూ రష్మిక తెలిపింది. అతని సలహా తీసుకోవడం నాకు చాలా అవసరం అంటూ చెప్పుకొచ్చింది అయితే వ్యక్తిగత విషయాలలో విజయ్ నాకు ఎంతో సపోర్టుగా నిలిచాడు అంటూ రష్మిక తెలిపింది. కాగా రష్మిక మందన్న చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయ్. విజయ్, రష్మిక ప్రేమలో ఉన్నారు అన్నదానికి మరోసారి రష్మిక మాటలు బలని చేకూర్చాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: