ఆ తేదీ నుండి "ఓటిటి" లో స్ట్రీమింగ్ కానున్న "భామా కలాపం 2"..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో నటిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న సీనియర్ నటి మనులలో ఒకరు అయినటువంటి ప్రియమణి గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె తన కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాల్లో హీరోయిన్ గా నటించి అద్భుతమైన విజయాలను టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. అందులో భాగంగా ఈ బ్యూటీ చాలా సినిమాల్లో తన అందాలను కూడా అదిరిపోయే రేంజ్ లో ఆరబోసి కొన్ని సంవత్సరాల క్రితం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ గా కూడా కెరియర్ ను కొనసాగించింది.
 


ఇకపోతే ఈ మధ్య కాలంలో ఈమె సినిమాల్లో హీరోయిన్ పాత్రల్లో కాకుండా ఇతర ముఖ్య పాత్రలలో మరియు కీలక పాత్రలలో కూడా నటిస్తూ తన కెరీర్ ను అద్భుతమైన జోష్ లో ముందుకు సాగిస్తుంది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం ఈ బ్యూటీ భామ కలాపం అనే లేడీ ఓరియంటెడ్ మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ నేరుగా ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల అయ్యి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ను తెచ్చుకుంది.


ఇలా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ జనాల నుండి రావడంతో ఈ మూవీ కి కొనసాగింపుగా "భామా కలాపం 2" అనే సినిమాని రూపొందించారు. ఇకపోతే ఈ సినిమాను కూడా నేరుగా ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఇకపోతే తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ ని ఫిబ్రవరి 16 వ తేదీ నుండి ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఈ సంస్థ వారు తాజాగా అధికారికంగా ప్రకటించారు. మరి ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి ఏ స్థాయి రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: