విలన్ బాబీ సింహ భార్య.. టాలీవుడ్ లో హీరోయినట తెలుసా?

praveen
బాబీ సింహ.. ఇటీవల కాలంలో వరుసగా సినిమాలలో నటిస్తూ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా దగ్గరవుతున్నాడు ఈ నటుడు. అయితే ఎన్నో ఏళ్ల నుంచి సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నప్పటికీ.. చిన్నచితక పాత్రలు మాత్రమే చేస్తూ వస్తున్నాడు. అయితే రవితేజ హీరోగా నటించిన డిస్కో రాజా మూవీలో మాత్రం మెయిన్ విలన్ పాత్రలో నటించి అదరగొట్టేసాడు. తన విలనిజంతో ప్రేక్షకులను మెప్పించాడు. అయితే సినిమా రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ బాబీ సింహ పోషించిన విలన్ పాత్రకి మాత్రం మంచి పేరు వచ్చింది. అయితే ఈ సినిమాతో అతనికి పాపులారిటీ రావడంతో వరుస అవకాశాలు కూడా తలుపు తట్టాయి అని చెప్పాలి.

 అందుకే బాబీ సింహ అంటే కొంతమంది ప్రేక్షకులు గుర్తుపట్టకపోవచ్చు. కానీ మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన డిస్కో రాజా సినిమాలో విలన్ అంటే మాత్రం అందరికీ టక్కున గుర్తుకు వస్తూ ఉంటుంది. అయితే అతన్ని అందరూ కూడా తమిళ నటుడుగా చూస్తూ ఉంటారు. కానీ అతను పుట్టి పెరిగింది మాత్రం హైదరాబాదులోనే. అయితే అనుకోకుండా ఆయన పేరెంట్స్ తమిళ రాష్ట్రంలోని కొడైకెనాల్ పరిసర ప్రాంతాలకు వలస వెళ్లడంతో అక్కడే సెటిల్ అయిపోయారు. దీంతో తమిళ ఇండస్ట్రీలో నటుడిగా అతను ఎంట్రీ ఇచ్చాడు.

 అయితే నటుడిగా ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే తనదైన యాక్టింగ్ తో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు బాబి సింహ. ఇక ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో వరుసగా అవకాశాలు అందుకుంటున్నాడు. అయితే గత ఏడాది సంక్రాంతికి విడుదలై సూపర్ హిట్ కొట్టిన వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా ఒక పవర్ఫుల్ విలన్ పాత్రలో కనిపించాడు బాబీ సింహ. అయితే ఇప్పుడు ఈ విలన్ కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారిపోయింది. బాబీ సింహా భార్య ఏకంగా ఒక హీరోయిన్ అన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసట. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ హీరోగా హైదరాబాద్ లవ్ స్టోరీ అనే  సినిమా వచ్చింది. ఇందులో బాబీ సింహ భార్య రేష్మి మీనన్ హీరోయిన్గా నటించిందట. తర్వాత సాయిరాం నటించిన నేనొకరం మూవీలోను హీరోయిన్గా నటించిందట. ఈ రెండు సినిమాలు ఫ్లాప్ కావడంతో ఈమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఇక ఇప్పుడు సినిమాలకు దూరం అయ్యి ఫ్యామిలీ లైఫ్ లో బిజీబిజీగా ఉంది రేష్మి మీనన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: