హనుమంతుడిగా చిరు.. రాముడిగా మహేష్.. ప్రశాంత్ వర్మ మాస్టర్ ప్లాన్?

praveen
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాదు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయిన దర్శకుడు ప్రశాంత్ వర్మ. మొన్నటి వరకు అతనికి చిన్న దర్శకుడు అనే పేరు ఉండేది. కానీ ప్రశాంత్ వర్మ ఎప్పుడైతే హనుమాన్ సినిమాను తీసి ప్రేక్షకుల ముందుకు వచ్చాడో.. అతని దర్శకత్వ ప్రతిభకు ప్రేక్షకులందరూ కూడా ఫిదా అయిపోయారు. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యాడు ప్రశాంత్ వర్మ. తేజ సజ్జ అనే ఒక చిన్న హీరోని హీరోగా పెట్టుకుని హనుమాన్ అనే సినిమాతో సంక్రాంతి బరిలో దిగాడు అయితే అప్పటికే ఎంతో మంది స్టార్ హీరోలు సినిమాలో సంక్రాంతికి రిలీజ్ అయ్యాయి.

 అయినప్పటికీ వెనక్కి తగ్గని ప్రశాంత్ వర్మ తన సినిమాపై ఉన్న నమ్మకంతో రిలీజ్ చేశాడు. ఇక స్టార్ హీరోలను వెనక్కినెట్టి ఈ సంక్రాంతికి అసలైన హీరోగా మారిపోయాడు ప్రశాంత్ వర్మ. ఇక హనుమన్ సినిమా కేవలం తెలుగులోనే కాదు అన్ని భాషల్లో కూడా ప్రేక్షకులను మెప్పించింది. విశ్లేషకుల నుంచి ప్రశంసలు కూడా అందుకుంది. అయితే ఈ సినిమా క్లైమాక్స్ లో ఎవరూ ఊహించని ట్విస్టును పెట్టాడు ప్రశాంత్ వర్మ. ఏకంగా జై హనుమాన్ అనే సినిమాను ఈ మూవీకి కొనసాగింపుగా తీస్తానని చెప్పుకొచ్చాడు. అయితే జై హనుమాన్ మూవీలో హనుమంతుడి పాత్రలో ఎవరు కనిపించబోతున్నారు అనే విషయంపై గత కొంతకాలం నుంచి చర్చ జరుగుతుంది..

 కొన్నాళ్ల వరకు మెగాస్టార్ చిరంజీవి హనుమంతుడు పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక సినిమా విడుదలైన తర్వాత చివర్లో చూపించిన కొన్ని సీన్స్ ప్రకారం దగ్గుబాటి రానా హనుమంతుడు పాత్ర చేయబోతున్నాడు అంటూ మరికొన్ని వార్తలు హల్చల్ చేశాయి. ఇక ఈ విషయం పైన ప్రస్తుతం చర్చ జరుగుతుంది. అయితే ఇటీవల ఈ విషయంపై అటు ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇచ్చాడు అన్నది తెలుస్తోంది. జై హనుమాన్ లో హనుమంతుడు పాత్రలో చిరంజీవిని చూసే అవకాశం ఉందట. ఈ విషయంపై మెగాస్టార్ తో మాట్లాడాలి అని ప్రశాంత్ వర్మ చెప్పినట్లు సమాచారం. అదే సమయంలో రాముడు పాత్రలో మహేష్ బాబు అయితే బాగుంటుంది.. ఇప్పటికే గ్రాఫిక్స్ చేసి చెక్ చేసామంటూ ప్రశాంత్ వర్మ చెప్పాడట. ఇక వీరిలో ఎవరు ఒప్పుకుంటారో చూడాలి అని ప్రశాంత్ వర్మ చెప్పినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: