క్రికెటర్ తో అనుష్క పెళ్లి.. ఫ్యాన్స్ త్వరలోనే గుడ్ న్యూస్ వినబోతున్నారా?

praveen
తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న అనుష్క శెట్టి గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. సూపర్ అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. మొదటి సినిమాతోనే తన అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు దక్కించుకొని ఆకట్టుకుంది. ఇక అనుష్క కెరియర్ను మలుపు తిప్పిన సినిమా మాత్రం అరుంధతి అని చెప్పాలి. కోడి రామకృష్ణ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఏకంగా ఘన విజయాన్ని సాధించింది. ఈ మూవీలో అనుష్క నటనకు సినీ ప్రేక్షకులు అందరూ కూడా ఫిదా అయిపోయారు.

 అయితే ఈ మూవీ తర్వాత ఒకవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటిస్తూనే మరోవైపు ఇతర హీరోల సరసన గ్లామర్ వలకబోస్తూ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా హవా నడిపించింది అనుష్క. అయితే సైజ్ జీరో అనే సినిమాతో ఒక ప్రయోగం చేసింది. ఏకంగా నాజూగ్గా కనిపించే అనుష్క భారీగా బరువు పెరిగిపోయింది. అయినా ఈ సినిమా పెద్దగా హిట్టు కూడా అవలేదు. కానీ ఆ తర్వాత అనుష్క కెరియర్ మాత్రం పూర్తిగా మారిపోయింది. బరువు తగ్గలేక అవకాశాలను కోల్పోయింది. దీంతో కొన్నేళ్లపాటు ఇండస్ట్రీకి దూరమైంది. ఇటీవలే మిస్ షట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది అన్న విషయం తెలిసిందే.

 అయితే ఈ సీనియర్ హీరోయిన్ పెళ్లికి సంబంధించిన వార్తలు ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రభాస్, అనుష్క పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ అప్పట్లో ఎన్నో వార్తలు హల్చల్ చేసాయ్. అయితే ఇక ఇప్పుడు మరోసారి అనుష్క పెళ్లికి సంబంధించిన వార్త తెర మీదికి వచ్చింది. త్వరలోనే ఈ హీరోయిన్ పెళ్లి పీటలు ఎక్క పోతుందట. ఒక క్రికెటర్ ఆమె వివాహం ఆడబోతున్నట్లు తెలుస్తోంది. నార్త్ ఇండియా కు చెందిన క్రికెటర్ ప్రస్తుతం సౌత్ ఇండియాలో ఆడుతున్నట్లు సమాచారం. ఇక వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు కూడా ఓకే చెప్పేసారట. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: