జక్కన్న మూవీ కోసం మహేష్ ట్రైనింగ్ షురూ.. ఏకంగా గడ్డకట్టే చలిలో?

praveen
దర్శకధీరుడు రాజమౌళి సినిమా అంటే చాలు కేవలం ఇండియాలోని సినీ ప్రేక్షకులు మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా సినీ లవర్స్ అందరు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే తన సినిమాలతో అంతలా ప్రేక్షకులను ప్రభావితం చేశాడు ఈ డైరెక్టర్. అయితే తారక్, చరణ్ లతో మల్టీస్టారర్ మూవీ ని తీసి త్రిబుల్ ఆర్ తో వరల్డ్ వైడ్ హిట్టు కొట్టాడు రాజమౌళి. అయితే ఇక ఇప్పుడు మహేష్ బాబు తో సినిమా తీసేందుకు సిద్ధమవుతున్నాడు అన్న విషయం తెలిసిందే.

 ఇక ఈ మూవీపై కూడా భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి. అయితే రాజమౌళితో ఎవరైనా హీరో సినిమా తీస్తున్నాడు అంటే చాలు సినిమా షూటింగ్ ప్రారంభం కావడానికి కొన్ని నెలల ముందు నుంచి.. ఆ సినిమా కోసం బాడీని మెయింటైన్ చేయడమే కాదు కొన్ని ప్రత్యేకమైన శిక్షణలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పాలి. అయితే మహేష్ బాబు కూడా ఇక రాజమౌళితో సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందు ఇప్పటికే ఇలాంటి ట్రైనింగ్ మొదలు పెట్టాడు అంటూ ఒక వార్త తెర మీదకి వచ్చింది. రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు ఫ్యామిలీతో కాకుండా ఒంటరిగా ఒక ట్రిప్ కు వెళ్ళాడు అని ఇండస్ట్రీలో ఒక టాక్ వైరల్ గా మారిపోయింది.

 ప్రపంచ యాత్రికుడి కాన్సెప్ట్ తో మహేష్ బాబుతో జక్కన సినిమా తీయబోతున్నాడట. మ్యాన్ వర్సెస్ వరల్డ్ తరహాలో అడ్వెంచర్ మూవీగా ఇది ఉండబోతుందట. అయితే ఇక ఈ సినిమా కోసం హీరో అడవుల్లో తిరగాల్సి ఉంటుందట. అయితే ఎప్పుడు ఫారిన్ ట్రిప్ కు వెళ్లే మహేష్ బాబు ఇప్పుడు జర్మనీ ట్రిప్ కు వెళ్లడానికి కూడా ఫ్యామిలీ లేకుండా తన డాక్టర్ కం ట్రైనర్ అయినా డాక్టర్ హారి కోయింగ్ తో కలిసి వెళ్ళాడు మహేష్. గడ్డకట్టే చలిలో మహేష్ ట్రెక్కింగ్  చేస్తూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. దీంతో ఇక రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు ఇప్పటినుంచి ట్రైనింగ్ మొదలెట్టేసాడు అంటూ అందరూ చర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: