ప్రభాస్ మూవీ లో.. తారక్, నానీ.. నిజమేనా?

praveen
సాధారణంగా స్టార్ హీరో కి సంబంధించిన ఏదైనా సినిమా తెరకెక్కుతుంది అంటే చాలు ఆ సినిమాకు సంబంధించి ఏదో ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే సినిమాలో హీరో హీరోయిన్ల విషయంలో మాత్రమే కాదు. ఏకంగా ఇతర స్టార్ హీరోలు ఇక మరో స్టార్ హీరో సినిమాల్లో కీలకపాత్రలో నటిస్తున్నారు అంటూ ఏదో ఒక వార్త ఎప్పుడు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతూ ఉంటుంది. అయితే ఇలాంటి వార్తలు కొన్నిసార్లు నిజమైతే ఇంకొన్నిసార్లు మాత్రం పుకార్లు గానే మిగిలిపోతూ ఉంటాయి అని చెప్పాలి.

 ఇక ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఓ సినిమా గురించి ఇలాంటి ఒక క్రేజీ న్యూస్ వైరల్ గా మారిపోయింది. అయితే దాదాపు 6 ఏళ్ల నుంచి హిట్ అనే పదానికి దూరమైన ప్రభాస్ ఇటీవల ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ అనే మూవీ తో ప్రేక్షకులు ముందుకు వచ్చి సూపర్ డూపర్ విజయాన్ని సాధించాడు అన్న విషయం తెలిసిందే. ఇక మరికొన్ని సినిమాలతో ప్రస్తుతం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక ఇలాంటి సినిమాలలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కల్కి మూవీ కూడా ఉంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకులు అందరిలో కూడా అంచనాలను ఏ రేంజ్ లో పెంచేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

 ఇక ఇప్పుడు ఈ మూవీ గురించి ఒక క్రేజీ న్యూస్ వైరల్ గా మారిపోయింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు కనిపించబోతున్నారట. ఈ మూవీ క్లైమాక్స్ కి ముందు వచ్చే సన్నివేశాల్లో పరశురాముడిగా జూనియర్ ఎన్టీఆర్ కృష్ణార్జునుడి పాత్రలో న్యాచురల్ స్టార్ నాని కనిపిస్తారట. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఈ మూవీలో అమితాబచ్చన్, దీపికా పదుకొనే, కమల్ హాసన్, దిశా పఠాణి లాంటి ఎంతోమంది సినీ ప్రముఖులు నటిస్తూ ఉన్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: