జమాల్ జమాల్ పాటపై.. భార్యతో కలిసి డాన్స్ ఇరగదీసిన రణబీర్.

praveen
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు సంపాదించుకున్న వారిలో రణబీర్ కపూర్, ఆలియా భట్  జంట కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. ఇద్దరు  తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఇండస్ట్రీలో స్టార్లుగా వెలుగొందుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక ఎవరికి వారు కెరియర్ లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీబిజీగానే ఉన్నారు. కాగా ఇటీవల ఈ స్టార్ దంపతులు ఒక అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. 69వ ఫిలింఫేర్ అవార్డుల్లో ఉత్తమ హీరో ఉత్తమ హీరోయిన్ల పురస్కారాలు అందుకున్నారు.

 ఇలా ఒకేసారి ఉత్తమ నటులుగా భార్యాభర్తలు ఇద్దరికీ కూడా అవార్డులు రావడంతో అభిమానుల ఆనందానికి అవతలు లేకుండా పోయాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఈ అవార్డు ఫంక్షన్ లో భార్యాభర్తలు ఇద్దరు కలిసి డాన్స్ చేసిన వీడియో ఒకటి వైరల్ గా మారిపోయింది.  గుజరాత్ లోని గాంధీ నగర్ లో జరిగిన అవార్డుల వేడుకలో ఈ క్యూట్ కపుల్స్ డాన్స్ తో ఇరగదీసారు. రణబీర్ కపూర్ ఇటీవల హీరోగా నటించిన యానిమల్ సినిమా విడుదలై సూపర్ హిట్ అయింది. ఇక ఏ సినిమాకి అటు ఉత్తమ నటుడు అవార్డును దక్కించుకున్నాడు రణబీర్. అయితే ఈ మూవీలో జమాల్ జమాల్ అనే పాట ఎంత సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

 ఇలా యానిమల్ మూవీలో సూపర్ హిట్ అయిన జమాల్ సినిమాలోని హుల్ స్టెప్ ని ఇక రణబీర్ కపూర్ దంపతులు క్రియేట్ చేశారు. అవార్డు అందుకున్న తర్వాత స్టేజి మీద డాన్స్ చేశాడు రణబీర్ కపూర్. ఇక స్టేజ్ కింద కూర్చున్న భార్య దగ్గరికి వచ్చి చిందులేసాడు.  తలపై గ్లాస్ పెట్టుకొని డాన్స్ చేస్తాడు. దీంతో ఆలియా భట్ కూడా సంతోషంలో భర్తతో కలిపి కాలు కదిపింది. ఇక వారిద్దరి మధ్య ఎంత అన్యోన్యత ఉంది అన్నదాన్ని ఇక అందరి ముందు మరోసారి తెలిసేలా చేశారు ఈ స్టార్ కపుల్స్. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. కాగా రాఖీ ఔర్ రాణి కా ప్రేమ్ కహాని సినిమాకి గానూ ఆలియా భట్ ఉత్తమ నటిగా అవార్డుని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: