పవన్ కళ్యాణ్ డైరెక్టర్ తో.. నాచురల్ స్టార్ నాని మూవీ?

praveen
తెలుగు చిత్ర పరిశ్రమలో టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నాడు సుచిత్. శర్వానంద్ హీరోగా వచ్చిన రన్ రాజా రన్ అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక అతను టేకింగ్ కి ప్రేక్షకులు కూడా ఫిదా అయిపోయారు. ఇక అయితే శర్వానంద్ లాంటి మిడ్ రేంజ్  హీరో తర్వాత ఏకంగా పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపును సంపాదించుకున్న ప్రభాస్ తో సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు సుజిత్.

 అయితే ఈ మూవీ పై భారీ రేంజ్ లోనే అంచనాలు పెరిగిపోయాయి అన్న విషయం తెలిసిందే. కానీ ఎందుకో భారీ అంచనాల మధ్య విడుదలైన సాహో సినిమా మాత్రం అనుకున్న రీతిలో విజయం సాధించలేకపోయింది. దీంతో డైరెక్టర్ సుజిత్ పై తీవ్రస్థాయిల విమర్శలు వచ్చాయి అని చెప్పాలి. అయితే 2019లో సాహో మూవీతో ప్రేక్షకులను పలకరించిన సుజిత్.. ఇక ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఇక ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓజి అనే సినిమా తీస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాపై కూడా భారీ రేంజ్ లోనే అంచనాలు ఉండడం గమనార్హం. అయితే ఇక ఇప్పుడు నేచురల్ స్టార్ నానితో సుజిత్ ఒక సినిమా చేయబోతున్నాడు అన్న వార్త టాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారిపోయింది.

 సాహో మూవీ ని గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించగా.. ఇక ఓజి మూవీ ని కూడా ఇలాంటి గ్యాంగ్ స్టర్ బ్యాక్ గ్రౌండ్ లోనే తెరకెక్కిస్తున్నాడు సుజిత్. ఇక ఇప్పుడు నానితో చేయబోయే సినిమాను కూడా మాఫియా, గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లోనే తీయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాకి డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తయిన తర్వాతే ఇక ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందట. ఇక మరోవైపు నాని కూడా అటు బలగం వేణుతో, దసరా శ్రీకాంత్ తో సినిమాలు చేయాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: