మెగాస్టార్ కి పద్మ విభూషణ్.. కాకాపట్టాడు అంటూ హీరోయిన్ సంచలన కామెంట్స్?

praveen
ఇటీవలే జరిగిన రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టాలీవుడ్ లో సీనియర్ హీరోగా తెలుగు ప్రేక్షకుల మెగాస్టార్గా కొనసాగుతున్న చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు వరించింది. అయితే ఆయన చిత్ర పరిశ్రమలో చేసిన సేవలకు మాత్రమే కాదు.. ఆయన చేసిన ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని ఈ అవార్డును ఇచ్చారు అని చెప్పాలి. అయితే మెగాస్టార్ చిరంజీవికి ఈ అవార్డు దక్కడంపై అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం ఈ విషయంపై అసంతృప్తితో ఉన్నారు.

 చిరంజీవి కంటే ఎక్కువగా ప్రజలకు సహాయం చేసి సేవా కార్యక్రమాలు చేసిన సెలబ్రిటీలు ఎంతోమంది ఉన్నారని.. వాళ్లకు ఇవ్వని పద్మ అవార్డును ఎందుకు చిరంజీవికి మాత్రమే ఇచ్చారు అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు వేస్తూ ఉండడం గమనార్హం. మరీ ముఖ్యంగా కరోనా టైం లో ఎంతో మందికి సహాయం చేసి ఎంతో మంది జీవితాల్లో దేవుడిగా మారిపోయిన సోను సూద్ కి ఎందుకు పద్మ అవార్డులు ఇవ్వలేదు. సోను సూద్ లాంటి గొప్ప వ్యక్తికి ఇవ్వని పద్మ విభూషణ్ అవార్డును చిరంజీవికి ఎందుకు ఇచ్చారు అంటూ ఎంతో మంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

 అయితే ఇదే విషయంపై హీరోయిన్ పూనం కౌర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది  సోను సూద్ కూడా ఆ ప్రెస్టీజియస్ అవార్డుకి అర్హులు. కరోనా టైంలో ఆయన చేసిన సేవ అసమాన్యమైనది. కానీ ఆయనకు ఏ రాజకీయ నాయకుడికి కాకా పట్టడం తెలియదు కదా అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది పూనం కౌర్. దీంతో ఇది కాస్త సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. డైరెక్టుగా మెగాస్టార్ చిరంజీవి రాజకీయ నాయకులను కాగా పట్టి ఈ అవార్డును తెచ్చుకున్నారు అని అర్థం వచ్చేలా పూనం కౌర్ పోస్ట్ పెట్టింది అని చెప్పాలి. ఇక పూనం కౌర్ పెట్టిన పోస్ట్ పై ఎంతోమంది మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: