లోకేష్ కనకరాజుపై.. దళపతి విజయ్ తండ్రి విమర్శలు?

praveen
ఒకప్పుడు ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయమైన వాళ్ళు ఇక దాదాపు పదికి పైగా సినిమాలు తీస్తేనే స్టార్ డైరెక్టర్గా గుర్తింపుని సంపాదించుకునే వారు. కానీ ఇటీవల కాలంలో మాత్రం ఒక్క సినిమాతో ప్రేక్షకులను మెప్పిస్తే చాలు ఏకంగా స్టార్ డైరెక్టర్ అనే ముద్ర పడిపోతుంది. ఇక కొంతమంది డైరెక్టర్లు అయితే మిగతా దర్శకుల లాగా కాకుండా తమకంటూ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకుంటున్నారు. అలాంటి వారిలో లోకేష్ కనకరాజ్ కూడా ఒకరు అని చెప్పాలి.

 ఇప్పుడు వరకు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ విజయాలు సాధించాయి. అయితే మార్వెల్స్ తరహాలోనే ఏకంగా లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ ని ప్రారంభించాడు ఈ డైరెక్టర్. ఇక ఇందులో ఎన్నో ట్విస్ట్ లు పెడుతూ సినిమాలు చేస్తూ ఉన్నాడు  ఇక ఇలాంటి సినిమాలు సూపర్ డూపర్ విజయం సాధిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నాయి. అయితే ఇటీవల తన సినిమాటిక్ యూనివర్స్ తో సంబంధం లేకుండా దళపతి విజయ్ తో ఒక సినిమా చేశాడు లోకేష్ కనకరాజు.

 లియో అనే టైటిల్ తో వచ్చిన ఈ మూవీ కూడా మంచి విజయాన్ని అందుకుంది అని చెప్పాలి. అయితే దర్శకుడు లోకేష్ కనకరాజు పై తమిళ హీరో విజయ్ తండ్రి చంద్రశేఖర్ పరోక్షంగా విమర్శలు గుప్పించారు  ఆయన చేసిన వ్యాఖ్యలు కాస్త సంచలనగా మారిపోయాయి. హీరో వల్ల మూవీ హిట్ అయిన దర్శకులు తామే గొప్ప అనుకుంటున్నారు. విజయ్ సినిమా రిలీజ్ కి ముందు చూసి దర్శకుడు కి ఫోన్ చేశాను. సెకండ్ హాఫ్ లో కొడుకును తండ్రి చనిపాలనుకోవడం.. మూఢనమ్మకాల సన్నివేశాలు అంత వాస్తవికంగా లేవు అని చెప్పాను. అయితే భోజనం చేస్తున్నా అని అతను కాల్ కట్ చేశాడు. విమర్శలను స్వీకరించేంత పరిణీతి లోకేష్ కి లేదు అంటూ చంద్రశేఖర్ విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: