డైరెక్టర్ రాజమౌళి పై.. చాలా కోపం వచ్చేది : ప్రశాంత్ వర్మ

praveen
ప్రస్తుతం కేవలం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మాత్రమే కాదు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్గా కొనసాగుతూ ఉన్నాడు రాజమౌళి. ఒకప్పుడు టాలీవుడ్ లో మాత్రమే స్టార్ డైరెక్టర్గా సినిమాలు తీసిన ఆయన ఇక బాహుబలి సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా కేవలం ఇండియాలో మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా సూపర్ హిట్ అయింది. అంతేకాదు ఆస్కార్ అవార్డును కూడా దక్కించుకొని తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని పెంచింది ఈ మూవీ.

 దీంతో ఇక రాజమౌళి దర్శకత్వంలో తెరకేక్కే సినిమాలలో ఒక్క అవకాశం వచ్చిన చాలు అని బడాబడా స్టార్స్ అందరూ కూడా అనుకునే విధంగా జక్కన్న ప్రస్తుతం ప్రస్తానాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. దీంతో హీరోగా మాత్రమే కాదు సైడ్ క్యారెక్టర్ లో నటించేందుకు కూడా ఎంతోమంది తెగ ఆశ పడుతూ ఉంటారు అని చెప్పాలి. నటీనటులు ఇలా అనుకుంటే ఇక యంగ్ డైరెక్టర్లు అందరూ ఆయన దగ్గర అసిస్టెంట్లుగా చేసి ఎన్నో విషయాలను నేర్చుకోవాలని ఆశపడుతూ ఉంటారు. అయితే తాను కూడా ఇలాగే అనుకున్నాను అంటూ ఇటీవల హనుమాన్ సినిమాతో హిట్టు కొట్టిన ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చాడు.

 ఒకానొక సమయంలో దర్శకుడు రాజమౌళి పై చాలా కోపం వచ్చింది అంటూ ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చాడు. నాకు రాజమౌళి గారి డైరెక్షన్ స్టైల్ అంటే చాలా ఇష్టం. అయితే ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసేందుకు చాలా ట్రై చేశాను.  ఇంజనీరింగ్ పూర్తవుతున్న సమయంలో మెయిల్స్ చేసేవాడిని. కానీ తమ డైరెక్షన్ టీం లో ఖాళీ లేదని రిప్లై వచ్చేది. అయితే ఏకలవ్య శిష్యుడిలా ఆయన దర్శకత్వం వహించిన సినిమాలను మేకింగ్ వీడియోలను చూస్తే ఎన్నో నేర్చుకున్నాను అంటూ ప్రశాంత్ వర్మ తెలిపాడు. అయితే ఇటీవలే ప్రశాంత్ వర్మ కూడా తన టేకింగ్ తో ఎంతగా గుర్తింపును సంపాదించుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: