ఊహించని ట్విస్ట్ ఇవ్వబోతున్న హనుమాన్ 2 !

Seetha Sailaja
చిన్న సినిమాగా విడుదలై వందల కోట్ల కలక్షన్స్ ను కొల్లకొడుతూ పాన్ ఇండియా రేంజ్ లో అందరి దృష్టిని ఆకర్షించిన ‘హనుమాన్’ మూవీ గురించి ఇప్పుడు నేషనల్ మీడియా వార్తలు రాస్తోంది. ఇప్పటివరకు తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం అయిన ప్రశాంత్ వర్మ పేరు జాతీయ స్థాయిలో మారుమ్రోగి పోతోంది.

ఈమధ్య ఒక జాతీయ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ ప్రశాంత్ వర్మ భవిష్యత్ లో రాజమౌళి ‘మహాభారతం’ సినిమాను తీయను అని జక్కన్న ఓపెన్ గా చెపితే తాను ఆసాహసం చేస్తాను అంటూ ప్రశాంత్ వర్మ చెపుతున్న మాటలు అతడి మితిమీరిన ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తున్నాయి. అనేక ప్రముఖ నిర్మాణ సంస్థలు ప్రశాంత్ వర్మ తీయబోయే ‘హనుమాన్ 2’ కు పెట్టుబడి పెడతాము అంటూ అతడికి ఫీలర్స్ పంపుతున్నారు అంటే ప్రస్తుతం ప్రశాంత్ వర్మకు పెరిగిన క్రేజ్ ఏమిటో అర్థం అవుతుంది.

ప్రస్తుతం ఈ దర్శకుడి దృష్టి అంతా ‘హనుమాన్’ సీక్వెల్ పై ఉంది అంటున్నారు. అయితే ఈ సీక్వెల్ లో తేజ్ సజ్జా నటించడని అతడి స్థానంలో రానా నటించే ఆస్కారం ఉండి అంటూ ఇండస్ట్రీ వర్గాలలో గాసిప్పులు గుప్పు మంటున్నాయి. సాధారణంగా ఒక దర్శకుడు ఎవరు ఊహించని ఒక బ్లాక్ బష్టర్ హిట్ ఇచ్చిన తరువాత అతడు తీయబోయే తదుపరి సినిమా పై అత్యంత భారీ అంచనాలు ఉంటాయి.

అలాంటి స్థాయిలో ఉన్న అంచనాలను అందుకోవడం ప్రముఖ దర్శకులకు కూడ అంత సులువైన పనికాదు. ఈ వాస్తవాన్ని గ్రహించిన ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’ సీక్వెల్ విషయంలో తొందరపాటు పడకుండా పక్కా ప్లాన్ తో వ్యవహరించి వచ్చే సంవత్సరం సమ్మర్ రేస్ కు తన ‘హనుమాన్’ సీక్వెల్ ను విడుదల చేయాలి ఆన్న ఆలోచనలో ఉన్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రశాంత్ వర్మ కోరితే అడ్వాన్స్ లు ఇవ్వడానికి అనేకమంది క్యూ కడుతున్న పరిస్థితులలో తన గడప దగ్గరకు వస్తున్న అదృష్టాన్ని కాదు అనుకుని ఎంతవరకు దృష్టి పెడతాడో చూడాలి..    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: