ఆ మూడు క్రేజీ మూవీల ఓవర్సీస్ డీల్స్ క్లోజ్డ్..?
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరో గా రూపొందుతున్న దేవర సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ యొక్క మొదటి భాగాన్ని ఏప్రిల్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ మూవీ యొక్క ఓవర్ సీస్ హక్కులను ఓ ప్రముఖ సంస్థ 27 కోట్ల భారీ ధరకు దక్కించుకున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చెంజర్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఇప్పటి వరకు ఈ మూవీ కి సంబంధించిన విడుదల తేదీని ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించలేదు. అయినప్పటికీ ఈ మూవీ యొక్క ఓవర్ సీస్ హక్కులను ఓ ప్రముఖ సంస్థ దాదాపు 20 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర అనే భారీ బడ్జెట్ సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయినప్పటికీ ఇప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన ఓవర్ సిస్ డీల్ క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. ఓ ప్రముఖ సంస్థ ఈ మూవీ యొక్క ఓవర్ సీస్ హక్కులను 18 కోట్ల భారీ ధరకు దక్కించుకున్నట్లు ఓ వార్త ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.