చిరంజీవికి పద్మ విభూషణ్.. మోహన్ బాబు ఏమన్నారో తెలుసా?

praveen
తెలుగు చిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలు చేసిన మెగాస్టార్ చిరంజీవి.. ఇక 60 ఏళ్లు దాటిపోతున్న ఇంకా స్టార్ హీరో గానే కొనసాగుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఏకంగా యంగ్ హీరోలతో సమానంగా సినిమాలు చేస్తూ ఇంకా బిసి బిసి గానే గడుపుతున్నాడు. అయితే కేవలం సినిమాలతో బిజీగా ఉండడమే కాదు ఇక మెగాస్టార్ చిరంజీవి చేసిన సేవా కార్యక్రమాల అన్ని ఇన్ని కావు. బ్లడ్ బ్యాంక్ పెట్టి ఎంతోమంది ప్రాణాలను కాపాడగలిగాడు.

  ఇండస్ట్రీలో హీరోగా సినిమాలు చేసి తన పని తాను చేసుకోవడమే కాదు ఎవరికి సమస్య వచ్చినా నేను ఉన్నాను అంటూ భరోసా ఇస్తూ ఉంటాడు మెగాస్టార్ చిరంజీవి. ఇక అలాంటి గొప్ప హీరోకి ఇటీవలే ఒక అత్యున్నతమైన అవార్డు లభించింది. దేశంలోనే రెండో అత్యున్నతమైన అవార్డు అయిన పద్మ విభూషణ్ ఇక మెగాస్టార్ ను వరించింది. అన్న విషయం తెలిసిందే. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం మెగాస్టార్ ముందు క్యూ కట్టింది. ఎంతోమంది సినీ ప్రముఖులు మెగాస్టార్ ఇంటికి వెళ్లి ఇక స్వయంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ ఉండడం గమనార్హం. ఇంకొంతమంది సోషల్ మీడియాలో ఈ విషయంపై స్పందిస్తున్నారు.

 అయితే ఇలా మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు రావడంపై ఇటీవల టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు స్పందించాడు. నా ప్రియమైన స్నేహితుడికి శుభాకాంక్షలు. ఈ పురస్కారానికి నువ్వు అన్ని విధాల అర్హుడివి. పద్మ బిభూషణ్ అవార్డు పొందిన నిన్ను చూసి ఎంతో గర్వపడుతున్నాను అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. అయితే ఇదే విషయంపై మంచు విష్ణు కూడా స్పందించారు. నిద్రలేవగానే శుభవార్త విన్నాను. చాలా సంతోషంగా అనిపించింది. చిరంజీవి గారికి ఎంతో విలువైన పద్మవిభూషన్ అవార్డు రావడం ఆనందంగా ఉంది. ఇది మన తెలుగు చిత్రశ్రమకు గర్వకారణం అంటూ పోస్ట్ పెట్టాడు మంచు విష్ణు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: