'ఆది పురుష్' ను నేనైతే బాగా తీసేవాడిని : ప్రశాంత్ వర్మ

praveen
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా కూడా యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పేరే వినిపిస్తోంది. ఎందుకంటే తన డైరెక్షన్ ప్రతిభతో  ప్రతి ఒక్కరిని కూడా ఫిదా చేస్తూ ఉన్నాడు. ఇప్పటికే డిఫరెంట్ కథ కథాంశంతో  ఉండే సినిమాలుకు కేరాఫ్ అడ్రస్ గా పేరు సంపాదించుకున్నాడు ప్రశాంత్ వర్మ. ఇక అతను దర్శకత్వంలో ఏదైనా మూవీ వస్తుంది అంటే చాలు అందులో ప్రేక్షకుల ఊహకందని రీతిలో ఏదో కొత్తదనం ఉంటుంది అనిప్రేక్షకులు అందరూ కూడా భావిస్తూ ఉంటారు.

 అయితే ఇక ఈ విషయంలో ప్రతిసారి కూడా ప్రశాంత్ వర్మ ప్రేక్షకులను సాటిస్ఫై చేస్తూనే వస్తున్నాడు. అయితే ఇటీవల హనుమాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అనే విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న సినిమాగా వచ్చి దాదాపు 300 కోట్ల కలెక్షన్స్ వైపుగా దూసుకుపోతుంది. అయితే హనుమాన్ సినిమా విడుదలైన తర్వాత అటు భారీ బడ్జెట్ తో ఓం రౌత్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆది పురుష్ సినిమాపై విమర్శలు వచ్చాయి. ప్రశాంత్ వర్మ తక్కువ బడ్జెట్ తో సూపర్ సినిమా తీస్తే.. ఓంరౌత్ 300 కోట్లతో చెత్త సినిమా చేశాడు అంటూ ఎంతో మంది విమర్శలు చేయడం మొదలుపెట్టారు.

 అయితే ఇక ఆది పురుష్ సినిమాపై ఇటీవల డైరెక్టర్ ప్రశాంత్ వర్మ స్పందించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలను తెరకెక్కించిన తీరు తనను ఆశ్చర్యపరిచింది అంటూ ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చాడు. అయితే మరికొన్ని సీన్స్ ని రూపొందించిన తీరు మాత్రం తనకు నచ్చలేదు అంటూ చెప్పుకొచ్చాడు. కొన్ని సీన్స్ ని నేనైతే ఇంకా బాగా తీసేవాడిని అనిపించింది అంటూ తెలిపాడు. ఏ దర్శకుడు కైనా అదే భావన కలుగుతుంది. ఇక ఆదిపురుష్ సినిమా రిజల్ట్ ను పట్టించుకోకుండా తాను అనుకున్న విధంగా హనుమాన్ మూవీ తీశాను అంటూ ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: