ఇంకా షూటింగే మొదలు కాలేదు.. భారీ రేటుకు మెగాస్టార్ సినిమా?

praveen
మెగాస్టార్ చిరంజీవి 60 ఏళ్లు దాటిపోతున్న ఇంకా వరుస సినిమాలతో బిజీ బిజీగానే ఉన్నాడు. కుర్ర హీరోలకు సైతం సాధ్యం కాని రీతిలో ఒకే ఏడాది ఏకంగా రెండు మూడు సినిమాలను రిలీజ్ చేసేందుకు కూడా రెడీ అవుతున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి వశిష్ట అనే యంగ్ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడు. బింబిసార అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టిన వశిష్ట..  ఇక ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ ని డైరెక్ట్ చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు.

 ఇక వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అనౌన్స్ చేసిన నాటి నుంచి కూడా అంచనాలు భారీ రేంజ్ లోనే పెరిగిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే. సోషియో ఫాంటసీ మూవీ గా ఈ సినిమా తెరకెక్కుతూ ఉండడం గమనార్హం. అయితే సంక్రాంతి కానుకగా ఈ మూవీ టైటిల్ ని కూడా రిలీజ్ చేశారు. విశ్వంభరా అనే ఆసక్తికర టైటిల్  ప్రేక్షకులు అందరిలో ఉన్న అంచనాలను మరింత రెట్టింపు చేసింది. టైటిల్ అదిరిపోయింది.. సినిమాపై అంచనాలను పెంచేసింది అంటూ ఎంతో మంది అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఫిబ్రవరి 1 నుంచి ఇక ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుందట.

 అయితే ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి విశ్వంభరా మూవీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారిపోయింది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇంకా మొదలుకానేలేదు అంతలోనే థియేట్రికల్  హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయాయి అంటూ ఒక టాక్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. అమెరికాలో థియేట్రికల్ హక్కులు దాదాపు 18 కోట్లకు అమ్ముడుపోయాడట. అయితే ఒక రకంగా ఇది పెద్ద మొత్తం అని చెప్పాలి. ఇక ఈ విషయం తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. కాగా ఫిబ్రవరి 1 షూటింగ్ ప్రారంభమైన తర్వాత.. వరుసగా రెండు వారాలపాటు షూటింగ్లో పాల్గొని తర్వాత కొంత బ్రేక్ తీసుకొని అమెరికా వెళ్లి వచ్చిన తర్వాత మళ్లీ షూటింగ్ మొదలు పెడతారట చిరంజీవి. కాగా ఈ మూవీకి ఎం ఎం కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: