సినిమాల్లోకి రాకముందే.. బాలయ్య ఆ పని చేశాడట తెలుసా?

praveen
నటసార్వభౌముడు ఎన్టీఆర్ వారసుడు గా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిశ్రమమైన బాలకృష్ణ ఇక స్టార్ హీరోగా ఎదిగాడు అన్న విషయం తెలిసిందే. తన నటనతో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. అయితే ప్రస్తుతం 60 ఏళ్ల వయసు దాటిపోతున్న ఇంకా కుర్ర హీరోలకు పోటీ ఇచ్చే విధంగానే వరుస సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు నందమూరి బాలకృష్ణ. మరోవైపు టాక్ షోలలో కూడా చేస్తూ ఇక ప్రేక్షకులకు మరింత అలరిస్తూ ఉన్నాడు అని చెప్పాలి.

 అయితే పదహారేళ్ల వయసులోనే బాల నటుడుగా ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. ఇక అప్పటి నుంచి ఇప్పటివరకు ఎక్కడ వెనక్కి తిరిగి చూసుకోలేదు బాలయ్య. ఇక తండ్రి ఎన్టీఆర్ తో కలిసి కూడా ఎన్నో సినిమాలో నటించాడు. అయితే సీనియర్ ఎన్టీఆర్ బాలయ్య కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి. ఈ సినిమాలో వీరబ్రహ్మేంద్రస్వామిగా ఎన్టీఆర్ ఆయన అమర భక్తుడిగా సిద్ధప్ప పాత్రలో బాలయ్య నటించగా.. సినిమాకు అటు ఎన్టీఆర్ దర్శకత్వం వహించాడు. అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యే సమయానికి అటు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు అని చెప్పాలి.

 కొన్ని సెన్సార్ అభ్యంతరాల కారణంగా ఈ సినిమా విడుదలకు ఆలస్యమైంది. ఇక ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత సెన్సార్ వారి నుంచి పర్మిషన్ తీసుకొని సినిమాను రిలీజ్ చేశారు. అయితే సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్గా నిలిచింది. అయితే ఎన్టీఆర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించే సమయంలో ఇక బాలయ్యకు కూడా కొన్ని దర్షకత్వ మెలుకువలు నేర్పించారట. దీంతో ఎన్టీఆర్ లేని సమయంలో స్వయంగా బాలయ్య.. ఏకంగా కొన్ని సన్నివేశాలను తెరకెక్కించారట. ఇలా ఏకంగా బాలయ్య నటుడుగా చిత్ర పరిశ్రమకు పరిచయం కాకముందే దర్శకుడిగా కూడా పనిచేశారట. తండ్రి దగ్గర నుంచి ఇలాంటి క్రమశిక్షణ నైపుణ్యం నేర్చుకున్నాడు కాబట్టి ఇప్పటికీ ఇండస్ట్రీలో రాణించగలుగుతున్నాడు అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: