అమెజాన్ ప్రైమ్‌లోకి డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రం ‘విధి’

Anilkumar
డిఫరెంట్ కంటెంట్‌తో వచ్చే చిత్రాలను ఆడియెన్స్ ఎప్పుడూ ఆదరిస్తుంటారు. అలా వచ్చిన ఓ చిత్రమే విధి. గత ఏడాది వచ్చిన ఈ విధి సినిమా ఆడియెన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. థియేటర్లో ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. నో ఐడియా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీదుగా రంజిత్. ఎస్ ఈ మూవీని నిర్మించారు. శ్రీనాథ్ రంగనాథన్ కేవలం ఈ సినిమాకు రచన చేయడం మాత్రమే కాకుండా కెమెరామెన్ బాధ్యతను కూడా స్వీకరించాడు. దర్శకుడిగా శ్రీకాంత్ వ్యవహరించాడు. రోహిత్ నందా, ఆనంది జంటగా నటించిన ఈ విధి చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. 


మూవీ అమెజాన్‌లో జనవరి 25 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లో థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్‌ను కూడా ఆకట్టుకుంటుంది. విధి చిత్రంలో పెన్ ఓ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుందన్న సంగతి తెలిసిందే. ఆ పెన్‌తో ఎవరు రాసినా కూడా చనిపోతుంటారు. అసలు అలా ఎందుకు జరుగుతుంది? పెన్ నేపథ్యం ఏంటి? పెన్ చేతికి వచ్చిన హీరో ఏం చేశాడు? అన్న ఇంట్రెస్టింగ్ పాయింట్‌లతో సినిమా ఆసక్తికరంగా సాగుతుంది.ఎన్నో యూత్‌ఫుల్ సినిమాలకు సంగీతం అందించిన శ్రీచరణ్ పాకాల.. విధికి మంచి సంగీతాన్ని అందించారు. 
ఆయన ఆర్ఆర్ సినిమాకు మేజర్ అస్సెట్‌గా నిలిచింది. 


కథ విషయానికొస్తే.. సూర్య (రోహిత్ నందా) ఓ అమాయకపు కుర్రాడు. సొంత ఊర్లో ఖాళీగా ఉండటం ఇష్టం లేక, జాబ్ కోసం సిటీకి వస్తాడు. అక్కడ తన ఫ్రెండ్స్ రూమ్లో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుండగా.. ఒకరోజు అతడు ఓ వ్యక్తి వద్ద పెన్ చూసి ఇంప్రెస్ అవుతాడు. అయితే దాని విలువ రూ.40 వేలు అని అతడు చెప్పగా విని షాక్ అవుతాడు. తర్వాత ఊహించని విధంగా అతడికి అలాంటి పెన్ ఒకటి దొరుకుతుంది. ఆ పెన్ ను అమ్మేసి క్యాష్ చేసుకోవాలని అనుకుంటాడు. కానీ ఆ పెన్ను కొనుక్కోవడానికి ఎవ్వరూ ముందుకు రారు. ఆ తర్వాత ఆ పెన్ తో ఎవరు రాస్తే వాళ్లు చనిపోతూ ఉంటారు.ఈ క్రమంలో తన ఇద్దరు స్నేహితులను పోగొట్టుకుంటాడు సూర్య. 


ఫైనల్ గా ఈ విషయం అతడికి అర్ధమవుతుంది. మరోవైపు తన చిన్నప్పటి ఫ్రెండ్ అయిన అమ్మాయి (ఆనంది) ని సూర్య ప్రేమిస్తూ ఉంటాడు. కొన్నేళ్ల తర్వాత కలుసుకున్నప్పటికీ వీరిద్దరూ తమ ప్రేమ గురించి చెప్పుకోరు. ఈ క్రమంలో ఆ పెన్ వల్ల.. సూర్య లైఫ్ లో ఇంకొన్ని పెను మార్పులు జరుగుతాయి. మరి అతడి లవ్ స్టోరీ సక్సెస్ అయ్యిందా? అసలు ఆ పెన్ వెనుక ఉన్న కథేంటి? అ పెన్ ను సూర్య ఏం చేశాడు? అనేది కథ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: