ఏంటీ.. రష్మిక మందన్న.. ఆ స్టార్ డైరెక్టర్ ను బ్లాక్ చేసిందా?

praveen
చలో అనే సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ హోదాని సంపాదించింది. వరుసగా సూపర్ హిట్లు కొడుతూ ఇక తనకు తిరుగులేదు అని నిరూపించింది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ సరసన పుష్ప అని సినిమాలో లక్కీ ఛాన్స్ దక్కించుకొని.. పాన్ ఇండియా హీరోయిన్గా మారిపోయింది. అయితే ప్రస్తుతం సౌత్లో వరుసగా ఛాన్సులు దక్కించుకుంటూనే మరోవైపు అటు బాలీవుడ్ లో కూడా పాగా వేసేందుకు సిద్ధమవుతుంది ఈ ముద్దుగుమ్మ.

 బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ వరుసగా అవకాశాలు దక్కించుకుంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవలే యానిమల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టింది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా వచ్చిన ఈ మూవీలో రష్మిక తన నటనతో మంచి మార్కులు కొట్టేసింది అని చెప్పాలి. ఇక ఇప్పుడు మరిన్ని సినిమా షూటింగ్ లతో బిజీ బిజీగా ఉంది. కాగా ఇప్పుడు రష్మికకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 రష్మిక మందన్న ఒక స్టార్ డైరెక్టర్ నెంబర్ ను బ్లాక్ లిస్టులో పెట్టేసిందట. ఒకప్పుడు రష్మికకు ఛాన్స్ ఇచ్చి మంచి హిట్టు ఇచ్చిన దర్శకుడిని ఇక ఇప్పుడు మనస్పర్ధలు కారణంగా బ్లాక్ చేసేసిందట. అయితే గతంలో ఆయనతో వచ్చిన మనస్పర్ధలతో  సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా ఎదుర్కొంది రష్మిక. ఈ క్రమంలోనే ఆ డైరెక్టర్ ఫ్యాన్స్ రష్మికకు అసభ్యకర మెసేజ్లు కూడా పెట్టారట. దీంతో ఏం చేయాలో తెలియక అలాంటి వీడియోస్ పంపిస్తున్న అన్ని నెంబర్స్ అన్నిటికీ కూడా బ్లాక్ చేసిందట. ఇంతకుముందు ఆ డైరెక్టర్ నెంబర్ ని కూడా బ్లాక్ చేసేసిందట ఈ హీరోయిన్. అయితే ఇది ఎంతవరకు నిజం అన్నది మాత్రం తెలియదు. సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: