విడాకుల విషయంలో.. చరణ్ చెప్పిన మాటనే నిహారిక ఫాలో అయిందా?

praveen
ఇటీవల కాలంలో అటు సినిమా ఇండస్ట్రీలో విడాకుల అంశం తెగ హాట్ టాపిక్ గా మారిపోతుంది. మునుపేన్నడు లేని విధంగా ఎంతోమంది సినీ సెలెబ్రెటీలు ఇక విడాకులు తీసుకుంటూ వేరుపడుతున్నారు.  ఇలా విడాకుల తర్వాత ఎవరి దారి వారు చూసుకుంటూ కెరియర్లో బీజీగానే మారిపోతున్నారు. అయితే ఇండస్ట్రీ విషయం పక్కన పెడితే మెగా ఫ్యామిలీలో కూడా ఇలాంటి విడాకుల అంశం తరచూ వెలుగులోకి వస్తూనే ఉంది. మెగా డాటర్లు ఇద్దరు కూడా ఇప్పుడు వరకు విడాకులు తీసుకున్నారు అన్న విషయం తెలిసిందే. చిరంజీవి కూతురు శ్రీజ విడాకులు తీసుకుని వేరుపడింది.

 ఇక మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కూడా చైతన్య జొన్నలగడ్డతో విడాకులు తీసుకుంది అన్న విషయం తెలిసిందే. ఇలా విడాకుల వార్తలతో అటు మెగా కుటుంబం తరచూ వార్తలో హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉంది. అయితే విడాకుల తర్వాత తాను ఎంతగానో ఏడ్చానని.. ఆ బాధ నుంచి బయటపడటానికి చాలా రోజుల సమయం పట్టింది అంటూ నిహారిక చెప్పుకొచ్చింది. అంత ఖర్చు పెట్టి అంత ఘనంగా పెళ్లి చేసుకున్న తర్వాత ఎవరైనా విడిపోవాలని ఎందుకు అనుకుంటారు. కానీ పరిస్థితులు అన్నీ మనం అనుకున్నట్లుగా ఉండవు అంటూ నిహారిక మొదటిసారి ఇటీవల విడాకులపై స్పందించింది.

 ఇలాంటి సమయంలో ఏకంగా నిహారిక విడాకులకు సంబంధించిన విషయాన్ని ఏకంగా రామ్ చరణ్ సినిమాలోని ఒక డైలాగ్ తో ముడిపెట్టి ఎంతోమంది నేటిజన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. రామ్ చరణ్ హీరోగా నటించిన ఆరెంజ్ సినిమాలో ప్రేమ అనేది జీవితాంతం ఉండదు.. కేవలం కొన్ని రోజులు మాత్రమే బాగుంటుంది అనే డైలాగ్ నిహారిక విడాకుల అంశంతో జత కలిపి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. చరణ్ చెప్పిన మాటను చెల్లి బాగా ఫాలో అయింది అంటూ కొంతమంది నేటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: