వామ్మో.. తేజ సజ్జ రెమ్యూనరేషన్.. పదింతలు చేశాడా?

praveen
సినిమా ఇండస్ట్రీలో ఎంతటి హీరో కైనా సరే సక్సెస్ వస్తేనే రెమ్యూనరేషన్ కూడా పెరుగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన హీరో సైతం ఒక్క సాలిడ్ హిట్టు కొట్టాడు అంటే పారితోషకం అమాంతం పెరిగిపోవడం చూస్తూ ఉంటాం. అయితే ఇక ఇప్పుడు తేజ సజ్జ రేటు కూడా ఇలాగే పెరిగిపోయిందట. అయితే గతంలోనే తేజ సినిమాలు చూస్తే ఆయన రేంజ్ పెరిగిపోయింది. కానీ ఎందుకో ఇండస్ట్రీ అది యాక్సెప్ట్ చేయలేకపోయింది. కానీ ఇటీవలే హనుమాన్ మూవీ సూపర్ హిట్ కావడంతో ఇక ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా యాక్సెప్ట్ చేయక తప్పలేదు.

 అయితే హనుమాన్ సినిమా హిట్టుతో తేజ సజ్జ పారితోషికం అమాంతం పెంచేసారట. ఈ సినిమా నిర్మాణ సమయంలోనే ఒక చిన్న నిర్మాత తేజ  కోసం ప్రయత్నిస్తే నేను పాన్ ఇండియా హీరోని అని ఆ నిర్మాతతో అన్నాడట. నిజమే ఇటీవలే తేజ సజ్జ హనుమాన్ మూవీ తో పాన్ ఇండియా హిట్టు కొట్టాడు. ఏకంగా స్టార్ హీరోలు సినిమాలతో సమానంగా పోటీకి దిగి అందరిని వెనక్కి నెట్టి బ్లాక్ బస్టర్ కొట్టేసాడు. ఏకంగా 100 కోట్ల క్లబ్లో కూడా చేరిపోయాడు. ఇక ఇప్పుడు తేజ సజ్జాన్ని పట్టుకోవడం అంత తేలిక కాదు అని అర్థం చేసుకుంటున్నారు దర్శక నిర్మాతలు.

 కాగా ఇప్పుడు అతని చేతిలో జై హనుమాన్ మూవీ ఉంది. అయితే హనుమాన్ లాంటి హిట్టు కొడితే ఏ హీరో అయినా పారితోషకం పెంచేస్తాడు. ఇక తేజ సజ్జ కూడా ఇదే చేసాడు. ఏకంగా జై హనుమాన్ సినిమాకు అతని పారితోషకం పదింతలు అయ్యే అవకాశం కూడా ఉంది. కానీ అంత పారితోషికం తేజ సజ్జకు ఇస్తే నిర్మాతకు వర్కౌట్ అవుతుందా అనేది కూడా ఒక ప్రశ్న? ఎందుకంటే ప్రతి సినిమా హనుమాన్ మూవీ లాగే బ్లాక్ పోస్టర్ అవ్వదు కదా. అందుకే తేజ సజ్జ పారితోషికాన్ని పెంచడం విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అని సినీ విశ్లేషకులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: