తారక్, మోహన్ బాబు లకు.. ఇంత అవమానం జరిగిందా?

praveen
కొన్ని శతాబ్దాల హిందువుల కల ఇటీవల నెరవేరింది అన్న విషయం తెలిసిందే. రామ జన్మభూమి అయిన అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఎంతో ఘనంగా జరిగింది. ఈ క్రమంలోనే ఇటీవల జనవరి 22వ తేదీన ఇక రామ మందిరంలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో జరిగింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ మహత్తరమైన కార్యక్రమానికి అతిరథ మహారధులు అందరూ కూడా హాజరయ్యారు. దేశవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది ప్రముఖులు అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి చేరుకొని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగము అయ్యారు అని చెప్పాలి.

 అయితే అటు తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి కూడా ఎంతోమంది ప్రముఖులు అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. మరి ముఖ్యంగా అక్కడ మెగా ఫ్యామిలీని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోయింది. టాలీవుడ్ పెద్దలు మెగాస్టార్ ఒక్కరే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ప్రభాస్, తారక్, మోహన్ బాబులకు అయోధ్య నుంచి ఆహ్వానం అందినప్పటికీ.. వెళ్లలేదు. అయితే ప్రభాస్ కు కాలు సర్జరీ కావడంతో నడవలేని స్థితిలో ఉన్న ఆయన వెళ్లలేదట. ఇక మరోవైపు మోహన్ బాబు కి ఆహ్వానం అందిన ఎక్కువ మంది జనాల్లో వెళ్లడం ఇష్టం.. లేక సెక్యూరిటీ ఇస్తానన్న వెళ్లలేదు అని స్వయంగా ఆయన వెల్లడించారు.
 అయితే ఇక ఇప్పుడు మోహన్ బాబు ఎన్టీఆర్ ల గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారిపోయింది. ఎందుకంటే మోహన్ బాబుకు అసలు అయోధ్య నుంచి ఆహ్వానమే అందలేదట. సీఎం స్థాయి వ్యక్తులకి ఆహ్వానం లేదు. మోహన్ బాబుకు ఎలా ఇస్తారు అనే ప్రశ్నలు కూడా వినిపించాయి. అలాగే ఇక టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ కి కూడా ఆహ్వానం అందిందా అనే ప్రచారం జరిగింది. ఆహ్వానం అందినా కూడా ఎన్టీఆర్ ఎందుకు వెళ్లలేదు అనే చర్చ జరగగా.  ఆయనకు కూడా ఆహ్వానం అందలేదని విషయం బయటపడిందట. అయితే గతంలో అమిత్ షా, తారక్ భేటీ తర్వాత తారక్ బిజెపి కి అనుకూలంగా ఉన్నారని ప్రచారం జరిగింది. ఆహ్వానం అంది ఉంటుందని అందరూ అనుకున్నప్పటికీ అలా జరగలేదట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: