షూటింగ్లో రామ్ చరణ్.. అతన్ని కాలితో తన్నాడట తెలుసా?

praveen
మెగాస్టార్ వారసుడిగా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన రామ్ చరణ్ ఇప్పుడు తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఏకంగా తనను తాను ఎప్పటికప్పుడు సరికొత్తగా ప్రేక్షకులను ప్రూవ్ చేసుకోవడంలో సక్సెస్ అవుతూ ఉంటాడు రామ్ చరణ్. ఇక సినిమాల కోసం ఎలాంటి కష్టమైనా ఇష్టంగా చేసేస్తూ ఉంటాడు అని చెప్పాలి. అయితే ఇక ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా గుర్తింపును సంపాదించుకున్నప్పటికీ ఎంతో ఒదిగి ఉంటాడు రామ్ చరణ్. ఎలాంటి వివాదాల జోలికి పోకుండా తన పని తాను చేసుకుంటూ ఉంటాడు.

 అందుకే ఇండస్ట్రీలో రామ్ చరణ్ గురించి ఎవ్వరిని అడిగినా కూడా ఎక్కువగా పాజిటివ్ విషయాలే చెబుతూ ఉంటారు. ఇక తన సినిమాలోని నటనతోనే కాదు తన వ్యక్తిత్వంతో కూడా ఎంతోమంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు అని చెప్పాలి. అయితే అలాంటి రామ్ చరణ్ గురించి ఇటీవలే ఒక నటుడు షాకింగ్ విషయాన్ని బయట పెట్టాడు. రాపిడ్ యాక్షన్ మెషిన్ మూవీ లో హీరోగా నటిస్తున్న నటుడు సూర్య.. గేమ్ చేంజర్ సినిమాలోను ఒక కీలకపాత్రలో నటిస్తున్నాడట.

 ఈ సినిమాకి శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీలో అటు విలన్ గా నటించే నవీన్ చంద్ర ఫ్రెండ్ క్యారెక్టర్ గా నటిస్తూ ఉన్నాడట సూర్య. అయితే రామ్ చరణ్ సూర్య మధ్య ఒక యాక్షన్స్ సన్నివేశం ఉంటుందట. ఆ సన్నివేశంలో సూర్యుని రామ్ చరణ్ కాలితో తన్నితే సూర్య ఎగిరి ఎక్కడో పడతాడట. ఆ సీన్ కోసం చాలా టేక్స్ తీసుకోవాల్సి వచ్చిందట. ప్రతి టేక్ లో రామ్ చరణ్ నన్ను కాలితో తనడం షాట్ అయిపోగానే.. నన్ను పైకి లేపి దుమ్ము దులిపి సారి చెబుతూనే ఉండడం చేశారు అంటూ సూర్య చెప్పుకొచ్చాడు. రామ్ చరణ్ చాలా మంచి మనసున్న వ్యక్తి తండ్రికి తగ్గ తనయుడు కాదు తండ్రికి మించిన తనయుడు అంటూ ప్రశంసలు కురిపించాడు సూర్య.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: