ముగ్గురు హీరోలను లైన్ లో పెట్టిన త్రివిక్రమ్.. నెక్స్ట్ సినిమా అతనితోనేనట?

praveen
తెలుగు చిత్ర పరిశ్రలో ఎంతమంది స్టార్ డైరెక్టర్లు ఉన్నప్పటికీ ఎందుకో త్రివిక్రమ్ కి మాత్రం ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఏకంగా తన సినిమాలలో డైలాగులతోనే మాయ చేసేస్తూ ఉంటాడు ఈ డైరెక్టర్. ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఎంతో హాయిగా సినిమా చూసే విధంగా ఇక సినిమాలని తెరకెక్కిస్తూ ఉంటాడు అని చెప్పాలి. ఇక త్రివిక్రమ్ సినిమాలో బలమైన పంచ్ డైలాగులు మాత్రమే కాదు ఇక గుండెకు తాకే ఎమోషనల్ డైలాగ్స్ కూడా ఉంటాయి  ఎప్పుడు ఫ్యామిలీలోని బంధాలను బంధుత్వాలకు ఉండే విలువను తెలియజేస్తూ ఉంటాయి త్రివిక్రమ్ సినిమాలు.

 రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇక ఇప్పుడు స్టార్ డైరెక్టర్గా ఇండస్ట్రీలో హవా నడిపిస్తూ ఉన్నారు. తన మార్క్ డైలాగులతో ఏకంగా మాటల మాంత్రికుడిగా పేరు సంపాదించుకున్నాడు అని చెప్పాలి. అయితే గత కొంతకాలం నుంచి పెద్దగా సినిమాలు చేయట్లేదు త్రివిక్రమ్. ఇక ఇటీవల చాలా గ్యాప్ తర్వాత మహేష్ బాబుతో ముచ్చటగా మూడోసారి గుంటూరు కారం అనే సినిమా తీసి ఇక ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో శ్రీ లీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ మూవీపై అక్కడక్కడ నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి అని చెప్పాలి.

 అయితే మహేష్ బాబుతో సినిమా పూర్తయింది కానీ ఇప్పటివరకు కొత్త సినిమా అప్డేట్ మాత్రం ఇవ్వలేదు త్రివిక్రమ్. దీంతో ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో అన్నది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఎన్టీఆర్ తో ఒక సినిమా అనౌన్స్ చేశాడు. కానీ ఇప్పటివరకు అప్డేట్ రాలేదు. ఇక ఇప్పుడున్న బిజీ షెడ్యూల్ చూసుకుంటే త్రివిక్రమ్ కు తారక్ డేట్స్ ఇవ్వడం కష్టమే. అయితే రామ్ చరణ్, అల్లు అర్జున్, నాని లపై గురూజీ ఫోకస్ పెట్టాడట. కోలీవుడ్ స్టార్ సూర్య సైతం త్రివిక్రమ్ లైనప్ లో ఉన్నారని ప్రచారం జరుగుతుంది. అయితే అన్ని కుదిరితే మొదట నానితో మూవీ చేయాలని అనుకుంటున్నాడట త్రివిక్రమ్. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: