ఒక్క మాటతో.. తారక్ ఫ్యాన్స్ కి హర్ట్ చేసిన విజయేంద్రప్రసాద్?

praveen
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా కొనసాగుతూ ఉన్నాడు రాజమౌళి. సీరియల్ డైరెక్టర్ స్థాయి నుంచి ఇక ఇప్పుడు దేశం గర్వించదగ్గ దర్శకుడిగా మారాడు. ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో రాజమౌళిని మించిన దర్శకుడు మరొకరు లేరు అనడంలో సందేహం లేదు. ఏకంగా తన సినిమాలతో ఎప్పుడు సెన్సేషన్ సృష్టిస్తూ ఎన్నో రికార్డులను బద్దలు కొడుతూ వస్తూ ఉన్నాడు. ఇక మొన్నటికీ మొన్న విడుదలైన త్రిబుల్ ఆర్ సినిమా కూడా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

 వరల్డ్ వైడ్ గా కూడా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక ఎన్నో రికార్డులను కూడా కొల్లగొట్టింది. అంతేకాదు ఆస్కార్ అవార్డును కూడా అందుకుని ప్రపంచ సినీ ప్రేక్షకులు అందరూ చూపులు కూడా ఒక్కసారిగా ఆకర్షించింది ఈ సినిమా. ఈ సినిమా విడుదలైన తర్వాత చరణ్,తారక్ అభిమానుల మధ్య ఒక చర్చ మొదలైంది. ఏకంగా చరణ్ ను మెయిన్ హీరోగా పెట్టి ఎన్టీఆర్ ను సైడ్ హీరోగా పెట్టినట్లుగా చూపించారు అంటూ ఎంతో మంది విమర్శలు చేశారు. ఇద్దరి పాత్రలను ఒకేలా చూపించడంలో రాజమౌళి విఫలమయ్యాడు అంటూ తారక్ ఫ్యాన్స్ కాస్త అసహనం వ్యక్తం చేశారు.

 అయితే ఇటీవల రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ చేసిన కామెంట్స్ కాస్త తారక్ ఫ్యాన్స్ ని హర్ట్ చేశాయి.ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రామ్ చరణ్ పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఎన్టీఆర్ పాత్రలో అమాయకత్వం ఉంటుంది. అయితే తారక్ పాత్ర చేయడం చాలా కష్టం. కథను ముందుకు తీసుకువెళ్లడంలో తారక్ పాత్ర ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది. ఇక రామ్ చరణ్ ని అల్లూరి సీతారామరాజుగా చూపిస్తే చాలామంది నార్త్ లో రాముడు వచ్చాడు అని అనుకున్నారు. మేము ఆ ఉద్దేశంతో తీయలేదు అంటూ చెప్పుకొచ్చారు విజయేంద్ర ప్రసాద్. అయితే ఇక తారక్ ది సపోర్టింగ్రోల్ అని విజయేంద్ర ప్రసాద్ చెప్పకనే చెప్పాడు అంటూ ఎంతో ఉంది తారక్ ఫ్యాన్స్ విజయేంద్ర ప్రసాద్  మాటలతో హర్ట్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: