ఆ స్టార్ హీరో రెమ్యూనరేషన్ వల్ల.. ఏకంగా సినిమానే ఆగిపోయిందట తెలుసా?

praveen
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ తో పాటుగానే రెమ్యూనరేషన్ కూడా పెరుగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధిస్తే అంతలా పారితోషికాన్ని పెంచేస్తూ ఉంటారు. అదే సమయంలో ఇక సక్సెస్ ట్రాక్లో ఉన్న హీరోకి వరుసగా ప్లాపులు వస్తే మళ్లీ రెమ్యూనరేషన్ తగ్గించాల్సి ఉంటుంది అని చెప్పాలి. కానీ కొంతమంది హీరోలు మాత్రం ఫ్లాప్ లు వచ్చినా కూడా తమ మార్కెట్ తగ్గలేదు అని భావిస్తూ చివరికి ఇక పారితోషకం తగ్గించకుండా నిర్మాతలను ఇబ్బందులకు గురి చేయడం చేస్తూ ఉంటారు.

 అయితే ప్రస్తుతం రవితేజ కూడా ఇలాగే చేస్తున్నాడు అంటూ ఒక టాక్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. ధమాకా సినిమాతో సూపర్ హిట్ కొట్టిన రవితేజ ఆ తర్వాత మాత్రం వరుస ఫ్లాప్ లతో సతమతమవుతూ ఉన్నాడు. ఇక మార్కెట్ ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు కాస్త తగ్గింది అని చెప్పాలి. అయినప్పటికీ రవితేజ పారితోషకం విషయంలో మాత్రం వెనక్కి తగ్గడం లేదట. దీంతో కొంతమంది ప్రొడ్యూసర్లు రవితేజతో సినిమాలు తీయడానికి కాస్త వెనక ముందు అవుతున్నారు అనే టాక్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.

 అయితే రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రావాల్సిన సినిమా బడ్జెట్ కారణంగా ఆగిపోయింది. నిర్మాతలుగా ఉన్న movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ ఇక పారితోషకం తగ్గించాలని రవితేజను డైరెక్టర్ గోపీచంద్ ని అడిగారట. అయితే డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఇందుకు ఒప్పుకున్నప్పటికీ రవితేజ మాత్రం ఒక్క రూపాయి కూడా తగ్గించే ప్రసక్తి లేదు అని మొండిపట్టుతో ఉన్నాడట. దీంతో ప్రొడ్యూసర్లు కూడా నష్టాల పాలు కావడం ఎందుకు అని సినిమా ఆపేసినట్లు తెలుస్తోంది. అయితే రవితేజ ఇలా చేస్తే రానున్న రోజుల్లో ప్రొడ్యూసర్లు ఆయన సినిమా నిర్మించడానికి కూడా ముందుకు రాని పరిస్థితి ఉంటుందని కొంతమంది సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: