స్వయంభు: భారీ బడ్జెట్ తో నిఖిల్ కొత్త ప్రయోగం?

Purushottham Vinay
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'స్వయంభు'. ఈ సినిమాకి భరత్ కృష్ణమాచారి దర్శకుడు కాగా, ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ పతాకంపై భువన్ - శ్రీకర్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.ఈ మూవీలో నిఖిల్ లెజెండరీ యోధుడి పాత్రలో నటించేందుకు ఆయుధ పోరాటం, మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీలో శిక్షణ తీసుకున్నాడు. భారీ యుద్ధ సన్నివేశాలతో అత్యంత భారీగా రూపొందనున్న ఈ సినిమాకి ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ నెలకొంది. ఈ మూవీలో సంయుక్త మీనన్ కథానాయికగా నటించింది.రామ మందిర ప్రాణప్రతిష్ఠ రోజున స్వయంభు శ్రీరాముని ఆశీస్సులు కోరుతున్న పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. ఇందులో టైటిల్ నిఖిల్ సిద్ధార్థ్ శ్రీరాముని దివ్యసముఖమునకు శిరస్సు వంచి నమస్కరిస్తూ తమ ప్రయత్నం విజయవంతం కావాలని ఆశీస్సులు కోరుతున్న దృశ్యం కనిపిస్తోంది. ఇక ఈ మూవీ నిఖిల్ కెరీర్ కి 20వ సినిమా కావడం ఆసక్తికరం.ఇక స్వయంభు మూవీ టాలీవుడ్ లో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా.



ఈ సినిమాకి కన్నడ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అలాగే ఎం ప్రభాహరన్ ప్రొడక్షన్ డిజైనర్.ఈ మూవీకి వాసుదేవ్ మునెప్పగారి డైలాగ్స్ అందిస్తున్నారు. ఇంతకుముందు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో లెజెండరీ యోధుడిగా నిఖిల్ ఎంతో అద్భుతంగా కనిపించాడు. కార్తికేయ 2 మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న నిఖిల్ రెట్టించిన ఉత్సాహంతో యుద్ధ వీరుడిగా ఈ మూవీలో నటిస్తున్నాడు.ఇక నిఖిల్ కార్తికేయ 2 మూవీ పెద్ద పాన్ ఇండియా హిట్ అయిన సంగతి తెలిసిందే. కృష్ణుడి నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ నార్త్ ఇండియన్స్ ని ఎంతగానో ఆకట్టుకొని ఫైనల్ రన్ లో ఏకంగా 122 కోట్ల గ్రాస్ వసూళ్లు కలెక్ట్ చేసింది. ఈ మూవీతో పాన్ ఇండియా హీరోగా మారిన నితిన్ ఆ తరువాత 18 పేజెస్, స్పై సినిమాలతో ఫ్లాప్స్ ఎదురుకున్నాడు. ఇక ఇప్పుడు ఈ స్వయంబు మూవీతో ఎలాంటి హిట్ ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: