దేవరను కలవర పెడుతున్న ఆ విషయాలు !

Seetha Sailaja
సంక్రాంతి భారీ సినిమాలు తరువాత ఏప్రియల్ 5న విడుదలకాబోతున్న జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ పై అత్యంత భారీ అంచనాలు ఉన్నాయి. ఈమధ్య ఈమూవీ అనుకున్న తేదీకి విడుదల అవ్వడం కష్టం అంటూ సోషల్ మీడియాలో గాసిప్పుల హడావిడి జరిగిన విషయం తెలిసిందే. ఈ గాసిప్పులను ఖండిస్తూ ఈమూవీ నిర్మాతలు క్లారిటీ ఇచ్చిన కొద్ది రోజులకే ఈమూవీ చుట్టూ అనుకోని సమస్యలు చుట్టూముడుతున్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి.

ఈసినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కు ఈమధ్య ఈమూవీ షూటింగ్ సమయంలో అనుకోకుండా గాయపడటంతో ఈమూవీ షూటింగ్ కు బ్రేక్ వేయవలసిన పరిస్థితి ఏర్పడింది. సైఫ్ కు తగిలిన గాయం చిన్నదే అయినప్పటికీ సైఫ్ అలీఖాన్ కొలుకోవడానికి మరికొన్ని రోజులు పడుతుంది అని అంటున్నారు.

దీనితో ఈమూవీ షూటింగ్ షెడ్యూల్ లో మార్పులు రావడంతో ఎంతవరకు ఈమూవీ అనుకున్న డేట్ కు విడుదల అవుతుంది అన్న సందేహాలు కొందరికి కలుగుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఈసినిమాకు సంగీత దర్శకత్వం వహిస్తున్న అనిరుద్ ఈమూవీకి సంబంధించిన పాటల ట్యూన్స్ ను ఇంకా పూర్తి చేయలేదు అంటూ గాసిప్పులు వస్తున్నాయి. ఈపాటల ట్యూన్స్ పూర్తి అయితే కానీ వాటిని రికార్డు చేయదయం ఆతరువాత ఆపాటలను ఘాట్ చేయడం పూర్తి కాదు.

మరొక వైపు ఈమూవీ విడుదలకు కేవలం రెండు నెలలు మాత్రమే మిగిలి ఉండటంతో ఈమూవీ పెండింగ్ షూటింగ్ అదేవిధంగ పాటల చిత్రీకరణ అనుకున్న సమయానికి పూర్తి అయి ఈమూవీ విడుదలకు అడ్డు లేకుండా వ్యవహారాలు నడుస్తాయి అంటూ ఈమూవీ యూనిట్ వర్గాలు లోలోపన మధన పడుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ గాసిప్పులు నిజం అయితే ‘దేవర’ మూవీ రాబోయే ఉగాది పండుగను టార్గెట్ చేస్తూ ఏప్రియల్ 5న విడుదల అవ్వడం కష్టం అంటున్నారు. ఈ డేట్ ను ‘దేవర’ పోగొట్టుకుంటే సమ్మర్ రేస్ లో ఎటువంటి పోటీ లేకుండా మరొక మంచి రిలీజ్ డేట్ దొరకడం కష్టం మరికొందరు అభిప్రాయపడుతున్నారు..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: