శివాజీ కి ఊహించని అదృష్టంగా మారబోతున్న బాలకృష్ణ !

Seetha Sailaja
రెండు దశాబ్ధాల పాటు మీడియం రేంజ్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శివాజీ ఆతరువాత సినిమాలకు దూరమై రాజకీయాల బాట పట్టాడు. కొన్నాళ్ళు భారతీయ జనతాపార్టీలో సభ్యుడుగా మరికొంత కాలం తెలుగుదేశ పార్టీ సానుభూతి పరుడుగా శివాజీ తన ద్విపాత్రాభినయం చేసినప్పటికీ రాజకీయాలలో అతడు పూర్తీగా రాణించలేకపోయాడు.

దీనితో మళ్ళీ యూటర్న్ తీసుకుని తనకు నటుడుగా గుర్తింపు తీసుకు వచ్చిన టాలీవుడ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో మళ్ళీ బిజీ అవ్వడానికి తనవంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. లేటెస్ట్ గా ముగిసిన ‘బిగ్ బాస్’ షోలో శివాజీ పాల్గొనడమే కాకుండా అక్కడ కూడ తనదైన వ్యక్తిత్వాన్ని ప్రదర్శించడంతో ‘బిగ్ బాస్’ సీజన్ 7లో కంటెస్టెంట్ గా పాల్గొని ఆ షోకు సంబంధించిన టాప్ 5 స్థానాల వరకు వెళ్లడంతో యువతకు శివాజీ నటన అతడి పాత సినిమాలు అందరికీ గుర్తుకు వచ్చాయి.

ఇండస్ట్రీలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం ఎటువంటి అవకాశాలు లేకుండా ఖాళీగా ఉన్న శివాజీ కి ఊహించని జాక్ పాట్ తగిలింది అని అంటున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభం కాబోతున్న బోయపాటి బాలకృష్ణల మూవీ ప్రాజెక్ట్ లో శివాజీకి నెగిటివ్ టచ్ ఉన్న ఒక కీలక పాత్ర కోసం శివాజీతో చర్చలు జరుగుతున్నాయి అని అంటున్నారు. శివాజీ కెరియర్ మంచి స్థాయిలో కొనసాగుతున్న గత కాలంలో శివాజీ ‘ఒట్టేసి చెబుతున్నా’ తో పాటు మరికొన్ని సినిమాలలో నెగిటివ్ పాత్రలలో నటించినప్పటికీ అతడికి రావలసినంత గుర్తింపు రాలేదు.

లేటెస్ట్ గా ఈటీవీ సంస్థ తీసిన ఒక వెబ్ సిరీస్ లో నటించిన శివాజీకి అతడి నటనకు సంబంధించి మంచి ప్రశంసలు లభించాయి. ‘బిగ్ బాస్’ షో నుండి బయటకు వచ్చిన తరువాత కొన్ని మీడియం రేంజ్ సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా శివాజీకి అవకాశాలు వస్తున్నట్లు సమాచారం. అయితే శివాజీ ఆ అవకాశాల పట్ల పెద్దగా ఆశక్తి కనపరచడంలేదు అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య అనుకోకుండా బాలకృష్ణ బోయపాటిల కాంబినేషన్ లో ఈసంవత్సరం ప్రారంభం కాబోయే మూవీలో నెగిటివ్ పాత్రకు ఎంపిక కావడంతో అతడికి ఊహించని అదృష్టం దక్కుతోంది అనుకోవాలి..  మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: