స్టార్ హీరో సినిమాలో.. విలన్ పాత్ర చేయబోతున్న బిగ్ బాస్ శివాజీ?

praveen
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోగా కొనసాగుతున్న బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో కొనసాగుతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఏకంగా ఇటీవల అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి అనే సినిమాలతో హ్యాట్రిక్ కొట్టాడు బాలయ్య. ఇక మరికొన్ని సినిమాలతో బాక్సాఫీస్ వద్ద గర్జించేందుకు సిద్ధమయ్యాడు అని చెప్పాలి  అయితే ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు అటు అన్ స్టాపబుల్ అనే టాక్ షో కూడా చేస్తూ బిజీబిజీగానే ఉన్నాడు ఈ నందమూరి హీరో. కాగా ప్రస్తుతం బాలయ్య కెరియర్ లో 19వ సినిమాగా బాబీ దర్శకత్వంలో ఒక మూవీ తెరకేక్కుతుంది.

 అయితే ఈ సినిమాను సమ్మర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు అనేది తెలుస్తుంది  అదే సమయంలో ఇక బాలయ్య తన 110 సినిమాను మరోసారి తనకు అచ్చొచ్చిన దర్శకుడు బోయపాటితోనే చేయబోతున్నాడట. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ మూడు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించాయి. ఏకంగా వరుస ప్లాపులతో సతమతమవుతున్న బాలకృష్ణను మళ్ళీ విజయాల బాట పట్టించాయి అని చెప్పాలి. ఇక నాలుగో సారి వీరి కాంబినేషన్లో సినిమా అనడంతో భారీ రేంజ్ లోనే అంచనాలు పెరిగిపోతున్నాయి.

 అయితే బోయపాటి తన సినిమాలలో విలన్ గా కొత్త వాళ్ళని ప్రయత్నించడం చేస్తూ ఉంటాడు. అప్పట్లో ఫ్యామిలీ హీరోగా పేరు సంపాదించుకున్న జగపతిబాబు ఇక అఖండ సినిమాలోవిలన్ గా చేశాడు. మరో ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ ని అఖండలో విలన్ గా మార్చేశాడు బోయపాటి. ఇక ఇప్పుడు మరోసారి బాలయ్యతో సినిమాలో టాలీవుడ్ హీరోని విలన్ గా మార్చబోతున్నాడట. అతను ఎవరో కాదు ఇటీవల బిగ్ బాస్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన శివాజీ. రాజకీయాలను పూర్తిగా దూరం పెట్టేసి సినిమాల మీదే దృష్టి పెట్టాడు శివాజీ. ఇటీవల ఒక వెబ్ సిరీస్ తో కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక సినిమాలు చేసేందుకు రెడీ అయ్యాడు. దీంతో అతనికి ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటున్నాడట బోయపాటి. ఇక బోయపాటి చేతిలో పడ్డాడు అంటే శివాజీ కెరియర్ మలుపు తిరిగినట్టే అంటూ ఎంతమంది కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: