'పుష్ప' కోసం అప్పుడు సమంత.. మరి ఇప్పుడు ఎవరో తెలుసా?

praveen
సాధారణంగా సినిమాలు కథ కథనంతో మాత్రమే కాదు పాటలతో కూడా విజయం సాధిస్తాయి అని నిరూపించిన మూవీస్ ఎన్నో ఉన్నాయి. ఏకంగా కొన్ని కొన్ని పాటలు అయితే సినిమా విజయంలో కీలక పాత్ర వహిస్తాయ్ అనేదానికి ఎన్నో ఎక్సాంపుల్స్ ఉన్నాయి. ఇక నేటి తరంలో అలాంటి ఎగ్జాంపుల్ గురించి మాట్లాడుకోవాలి అంటే పుష్ప మూవీ అని చెప్పాలి. ఈ మూవీ లో అల్లు అర్జున్ నటనకి వంక పెట్టాల్సిన అవసరం లేదు  ఇక సుకుమార్ టేకింగ్ కి అయితే ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. దానికి తోడు ఇక సమంత చేసిన స్పెషల్ సాంగ్ మూవీ విజయంలో కీలక పాత్ర వహించింది.

 ఊ అంటావా ఉహు అంటావా అంటూ ఉండే పాటలో సమంత చేసిన డాన్స్ అయితే కుర్ర కారు అందరిని కూడా పిచ్చెక్కించింది. కేవలం తెలుగులో మాత్రమే కాదు అన్ని భాషల్లో కూడా ఈ సాంగ్ ఎంత సూపర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ సాంగ్ సూపర్ హిట్ అవడం అటు సినిమాకి కూడా ఎంతగానో కలిసి వచ్చింది. దీంతో ఈ పాట సినిమా సక్సెస్ లో భాగం అయిపోయింది అని చెప్పాలి. కాగా ఇప్పుడు పుష్ప మూవీకి సీక్వెల్ తెరకెక్కుతుంది. ఈ సినిమాపై కూడా భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే పుష్ప పార్ట్ వన్ లో ఉన్న సమంత సాంగ్ కి తగ్గట్లుగానే రెండో పార్ట్ లో కూడా ఒక స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నాడట సుక్కు.

 ఏకంగా పార్ట్ 1కి మించిన సాంగ్ నే పార్ట్ 2 చూసే అవకాశం ఉంది అనేది తెలుస్తుంది. అయితే కేవలం పుష్ప మూవీ మాత్రమే కాదు గత సినిమాలు చూసుకున్న అల్లు అర్జున్, సుకుమార్, దేవిశ్రీల కాంబినేషన్ ఐటమ్ సాంగ్ అంటే ఇక అది ఒక ట్రెండ్ సెట్టర్ అని చెప్పాలి. అయితే పార్ట్ 2 లో స్పెషల్ సాంగ్ కోసం ఒక యంగ్ బ్యూటీ ని తీసుకున్నారు అని గాసిప్స్  వినిపిస్తున్నాయి. ఆమె ఎవరో కాదు ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా కొనసాగుతున్న శ్రీ లీలనట   ఆమెనే తమ ఐటెం గర్ల్ గా మేకర్స్ ఎంచుకున్నారని ఒక టాక్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది. కాగా ఈ మూవీ ఆగస్టు 15 రిలీజ్ చేయబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: