మహేష్ స్టామినా చూపించాల్సిన టైం ఇది..!
భరత్ అనే నేను, మహర్షి, సర్కారు వారి పాట సినిమాలకు కూడా కేవలం మహేష్ నటన తప్ప సినిమాల్లో పెద్దగా మ్యాటర్ లేదని అన్నారు. కానీ కట్ చేస్తే ఆ సినిమాలు కూడా బ్రేక్ ఈవెన్ సాధించేలా చేశాడు మహేష్. కేవలం మహేష్ వల్లే ఈ సినిమాలు హిట్ అయ్యాయని చెప్పొచ్చు. ఎక్కడో ఒక చోట డైరెక్టర్ ఫెయిల్ అవుతాడేమో కానీ మహేష్ ఎప్పుడు ఫెయిల్ అవ్వడని మరోసారి ప్రూవ్ చేశాడు.
గుంటూరు కారం సినిమాలో కూడా మహేష్ తన ఫుల్ ఎఫర్ట్స్ తో మెప్పించే ప్రయత్నం చేశాడు. గుంటూరు యాసలో రమణ పాత్రలో అదరగొట్టేశాడు. ఈ సినిమాలో డ్యాన్స్ ల విషయంలో కూడా తన ఫ్యాన్స్ కే షాక్ ఇచ్చాడు మహేష్. గుంటూరు కారం సినిమా కథ కథనాల కన్నా మహేష్ ఎఫర్ట్స్ అన్నీ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తున్నాయి. అందుకే రిలీజ్ నాడు మొదటి షోకి డివైడ్ టాక్ ఉన్నా చిన్నగా ఆ టాక్ పాజిటివ్ గా మారి సినిమా చూసేందుకు ఆడియన్స్ ఆసక్తి చూపిస్తున్నారు.గుంటూరు కారం వసూళ్లు కూడా హిట్ టార్గెట్ రీచ్ అయితే మాత్రం మహేష్ ఇక మీదట ఎలాంటి సినిమా చేసినా టాక్ తో సంబంధం లేకుండా హిట్ పక్కా అని చెప్పొచ్చు. అయితే నెక్స్ట్ మహేష్ మూవీ రాజమౌళితో ఉంది. ఇక ఆ సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.