వెంకటేష్ ను నడిపిస్తున్న కనిపించని శక్తి !

Seetha Sailaja
విక్టరీ వెంకటేష్ గా గత 4 దశాబ్ధాలుగా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్న వెంకటేష్ నటించిన 75వ సినిమా ‘సైంధవ్’ విడుదల సందర్భంగా ఒక ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆశక్తికర విషయాలు షేర్ చేశాడు. తాను సినిమా హీరోగా మారుతానని కలలో కూడ అనుకోలేదని తన తండ్రి రామానాయుడు తీయాలి అని అనుకున్న ‘కలియుగ పాండవులు’ సినిమాలో నటించడానికి ఒక టాప్ హీరో రిజక్ట్ చేయడంతో బాధపడిన తన తండ్రి అనుకోకుండా తనను అదే సినిమాలో హీరోగా చేసిన విషయాన్ని బయటపెట్టాడు.



ఇక తన కెరియర్ పై తన తల్లి ప్రభావాన్ని వివరిస్తూ కష్టాలను ఎదుర్కుని ఎలా జీవితంలో నిలబడాలి అన్న విషయాన్ని తన తల్లి దగ్గర నుంచి నేర్చుకున్న విషయాన్ని తెలియ చేశాడు. ఒకానొక సమయంలో తాను సినిమా జీవితంలో ఇమడలేక ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు అలనాటి టాప్ హీరో శోభన్ బాబు చెప్పిన కొన్ని సలహాలు వల్ల తన ఆలోచనలు మారిపోయాయని అయితే ఇప్పటికీ ప్రతిరోజూ కొంత సమయం ఆధ్యాత్మిక సాధనకు కేటాయిస్తున్న విషయాన్ని వివరిస్తూ తెలియని శక్తి ఏదో ప్రతి వ్యక్తిని నడిపిస్తోందని అదే తన దృష్టిలో దేవుడు అని అంటున్నాడు.



తాను జీవితంలో ఇంత సుఖంగా జీవిస్తున్నాను అంటే దానికి కారణం తన అన్నయ్య సురేష్ బాబు అని అంటూ తనకు డబ్బుల వ్యవహారాలు ఆస్తుల వ్యవహారాలు ఏమాత్రం తెలియవని తన విషయాలు అన్నీ తన అన్న చూసుకుంటాడని అంటూ తన అన్నతో తనకు ఉన్న సాన్నిహిత్యాన్ని వివరించాడు.


తన అలవాట్ల గురించి విరిస్తూ ప్రపంచంలో ఉన్న అన్ని రకాల వంటలు తాను తింటానని చెపుతూ తనకు చాల సెంటిమెంట్లు అని చెపుతున్నాడు. ‘మనం ఎంతటి సమర్థులమైనా’ 30 శాతం పని మన చేతిలో ఉంటుంది. మిగిలిన 70శాతం పని కనిపించని ఆశక్తి చేయి స్తుంది’ అని వెంకీ అంటూన్న మాటలు ఆయన ఆధ్యాత్మిక కోణాన్ని సూచిస్తున్నాయి..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: