క్రేజీ కాంబినేషన్ అంటే ఇది.. రవితేజ ఎవరితో సినిమా చేస్తున్నాడో తెలుసా?

praveen
సాధారణంగా ఇండస్ట్రీ లో కొన్ని క్రేజీ కాంబినేషన్లు సెట్ అయితే బాగుండు అని అభిమానులు అందరూ కూడా కోరుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అలాంటి క్రేజీ కాంబినేషన్ల లో అనుదీప్ కేవీ, రవితేజ కాంబినేషన్ కూడా ఒకటి. కామెడీని పండించడం లో ఇక రవితేజను మించిన వారు మరొకరు లేరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. రవితేజ కామెడీ టైమింగ్ కి కోట్లాదిమంది అభిమానులు ఉన్నారు. ఇప్పుడంటే మాస్ యాక్షన్ కమర్షియల్ సినిమాలు చేస్తున్నాడు. కానీ ఒకప్పుడు మాత్రం ఏకంగా కామెడీ ట్రాక్ ఎక్కువగా ఉండే సినిమాలతోనే ప్రేక్షకులకు దగ్గరయ్యాడు రవితేజ.

 రవితేజ లోని కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ అటు అభిమానులు అందరూ కూడా పిచ్చిగా ఇష్టపడుతూ ఉంటారు. ఇక మరోవైపు అనుదీప్ కేవీ తన డైరెక్షన్ తో ప్రేక్షకులను ఎంతలా కడుపుబ్బా నవ్వించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జాతి రత్నాలు సినిమాతో పాపులర్ అయిన అనుదీప్ కేవీ ఇక ఆ తర్వాత పలు సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చి హిట్టు కొట్టాడు. అయితే ఇద్దరు కాంబినేషన్లో సినిమా వచ్చింది అంటే అది మరో లెవెల్ లో ఉంటుందని అభిమానులు అనుకున్నారు. అయితే అభిమానులు కోరిక ఇప్పుడు నెరవేరేలాగే కనిపిస్తూ ఉంది.

 ఎందుకంటే అనుదీప్, రవితేజ కాంబినేషన్లో సినిమా రాబోతుందట. ఇందుకు సంబంధించిన వార్త కాస్త ప్రస్తుతం ఇండస్ట్రీలో తెగ హాట్ టాపిక్ గా మారి పోయింది. కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉందట. సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ ఇక ఈ సినిమాకు నిర్మించబోతుంది అన్నది తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది అని చెప్పాలి. కాగా మాస్ మహారాజ రవితేజ ఈగల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: