గుంటూరు కారం: పక్కా సంక్రాంతి బొమ్మ.. ఆ సీన్ హైలెట్?

Purushottham Vinay
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా ఈరోజు విడుదల అయ్యింది.ఈ సినిమా రిలీజ్ కి ముందు ట్రైలర్, సాంగ్స్ తో సినిమాపై భారీ అంచనాలు పెంచారు. ఈ సినిమాలో శ్రీలీల ఇంకా మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు. అమ్మ సెంటిమెంట్ తో ఓ మాస్ కమర్షియల్ కథకి ఎమోషన్ జోడించి త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమా తీశాడు.ఈ సినిమా చూసే ప్రేక్షకులు అమ్మ సెంటిమెంట్ కి ఎమోషన్ ఫీల్ అవుతూనే ఖచ్చితంగా మహేష్ బాబు స్టైల్, స్వాగ్, యాక్షన్ కి ఎంటర్టైన్ అవుతారు. ప్రస్తుతం గుంటూరు కారం సినిమా థియేటర్స్ లో ఒక రేంజ్ లో సందడి చేస్తుంది. ఈ సినిమాలో ఆడియన్స్ తో పాటు ప్రేక్షకులకు కావాల్సిన ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు త్రివిక్రమ్. ఈ సినిమా మొదటి హాఫ్ లో వచ్చే ఒక డ్యాన్స్ సీక్వెన్స్ అయితే ఈ సినిమాకి హైలెట్ గా నిలుస్తుంది.



అలవైకుంఠపురంలో సినిమాలో అల్లు అర్జున్, సునీల్ తో ఓ స్పెషల్ డ్యాన్స్ ఎపిసోడ్ ప్లాన్ చేయగా అది చాలా బాగా వర్కౌట్ అయింది. ఇటీవల ధమాకా సినిమాలో కూడా పల్సర్ బైక్ సాంగ్ పెట్టగా ఇది కూడా బాగా వైరల్ అయింది. దీంతో గుంటూరు కారం సినిమాలో కూడా ఓ స్పెషల్ డ్యాన్స్ ఎపిసోడ్ ప్లాన్ చేశారు.మహేష్ ఇంకా శ్రీలీల కలిసి ఈ ఊపు ఉన్న పాటకి ఓ రేంజ్ డ్యాన్స్ వేస్తారు. పలాస సినిమాలోని నాది నక్కిలేసు గొలుసు సాంగ్ గతంలో బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఈ డ్యాన్స్ సీక్వెన్స్ మొత్తానికి కూడా థియేటర్స్ దద్దరిలుతున్నాయి. ఫ్యాన్స్ ఫుల్ రచ్చ చేస్తూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మరోసారి రశ్రీలీల తన డ్యాన్స్ తో దుమ్ము దులిపితే మహేష్ బాబు గతంలో కంటే మాస్ స్టెప్పులతో డ్యాన్స్ ఒక రేంజ్ లో అదరగొట్టాడు. బాబు, శ్రీలీల మాస్ స్టెప్పులు ఫ్యాన్స్ ఖచ్చితంగా థియేటర్లో చూడాల్సిందే. ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా ఈ సినిమా పక్కా ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: