ఆస్కార్ రేసులో షారుఖ్ సినిమా?

Purushottham Vinay
గత సంవత్సరం ఏకంగా మూడు బ్లాక్ బస్టర్స్ ఖాతాలో వేసుకున్నాడు బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్. ఒక్క సంవత్సరంలోనే దాదాపు రూ.2 వేల కోట్లకుపై పైగా వసూళ్ళని సంపాదించి అరుదైన ఘనత అందుకున్నాడు.జీరో లాంటి డిజాస్టర్ తరువాత దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తీసుకొని పఠాన్ తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. షారుఖ్, దీపికా పదుకొణె కలిసి నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ మూవీతో బాక్సాఫీస్ వద్ద తిరుగులేని రారాజు అని మరోసారి నిరూపించుకున్నాడు బాద్ షా. వరుస పరాజయాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న బాలీవుడ్ కు పుర్వ వైభవం తీసుకొచ్చాడు. ఇక ఆ తర్వాత కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో జవాన్ మూవీతో మరోసారి ప్రేక్షకులను అలరించాడు. ఓకే ఏడాదిలో విడుదలైన ఈ సినిమాలకు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. వరుసగా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరించిన షారుఖ్ ఖాన్ ఆ తర్వాత డంకీ సినిమాతో పలకరించాడు.రాజ్ కుమార్ హిరాణి లాంటి టాప్ డైరెక్టర్ దర్శకత్వంలో షారుఖ్ నటించిన డంకీలో తాప్సీ పన్నూ, విక్కీ కౌశల్ కీలకపాత్రలు పోషించారు.



 గత సంవత్సరం చివర్లో విడుదలైన ఈ మూవీకి మంచి రివ్యూస్ వచ్చాయి.ముఖ్యంగా చాలా కాలం తర్వాత మరోసారి తన కామెడీ టైమింగ్ తో షారుఖ్ నవ్వించడం.. అద్భుత నటనతో ఎమోషనల్ డ్రామాతో బాగా మెప్పించాడు. కానీ ఊహించిన రేంజ్ లో ఈ సినిమా వసూళ్లు రాబట్టలేకపోయింది.ఇప్పుడు ఈ అత్యంత ప్రతిష్టాత్మకమైన అకాడమీ అవార్డ్స్ 2024 కోసం పోటీ పడనుందని సమాచారం తెలుస్తోంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి ఇంకా ఎలాంటి అఫీషియల్ ప్రకటన రాలేదు.స్వదేస్, పహేలీ సినిమాల తర్వాత ఆస్కార్ కోసం పోటిపడనున్న షారుఖ్ మూడవ చిత్రం ఇదే కావడం విశేషం. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన పఠాన్ సినిమా అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. 1000 కోట్ల మార్కును దాటి 2023లో మొదటి 1000 కోట్ల బాలీవుడ్ చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత అట్లీ తెరకెక్కించిన జవాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 1148.32 కోట్లతో అత్యధిక వసూళ్లు చేసిని గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన డంకీ సినిమా రూ.400 కోట్ల మార్క్ దాటింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: