గుంటూరు కారం: మహేష్ మాత్రం తగ్గేదేలే?

Purushottham Vinay
టాలీవుడ్ టాప్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీలీల హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ మాస్, యాక్షన్ ఎంటర్టైనర్ గుంటూరు కారం. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన సినిమాపై భారీ అంచనాలు ఉండడం వల్ల సంక్రాంతి కానుకగా ఈరోజు భారీగా విడుదలైన ఈ సినిమా కొన్ని చోట్ల ఆర్ ఆర్ ఆర్ సినిమా రికార్డులని సైతం బద్దలు కొట్టింది. హైదరాబాద్ లో అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఆర్ ఆర్ ఆర్, సలార్ వంటి పెద్ద పెద్ద పాన్ ఇండియా సినిమాల రికార్డులని బద్దలు కొట్టి 11 కోట్ల పైగా గ్రాస్ రాబట్టింది.ఇది నిజంగా పెద్ద సెన్సేషనల్ రికార్డ్ అనే చెప్పాలి.కథలో కొత్తదనం లేకపోయిన ఆకట్టుకునే కథనంతో సాగుతుంది సినిమా. ఇక ఇటు నవ్విస్తూనే అటు యాక్షన్, ఎలివేషన్‌తో చాలా బాగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా మహేష్ బాబు ఫ్యాన్స్‌కు ఈ సినిమా ఓ మంచి ట్రీట్ అనే చెప్పాలి. ఇటు యాక్షన్‌తో పాటు మంచి కామెడీ టైమింగ్‌తో అదరగొట్టాడు సూపర్ స్టార్ మహేష్.  



ముఖ్యంగా ఈ సినిమాలో మహేష్ తన డైలాగ్ డెలివరీతో ఎంతగానో ఆకట్టుకున్నాడు. మహేష్ కొన్ని సీన్స్‌లో నటించి అదరగొట్టాడు. కొన్ని సీన్స్‌లో అయితే దర్శకుడు త్రివిక్రమ్ పంచ్ డైలాగ్స్‌తో కేక పెట్టించాడు. థియేటర్స్‌లో ఆ డైలాగ్స్‌కు చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక ఎప్పటిలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ క్లైమాక్స్‌లో తన డైలాగ్స్‌తో మైమరిపించాడు. కథ పేలవంగా ఉన్నా మహేష్ బాబు మాత్రం ఈ సినిమాను తన భూజాలపై మోశాడని చెప్పోచ్చు. అటు యాక్షన్ సీన్స్‌తో పాటు, కామెడీ టైమింగ్‌తో మహేష్ సూపర్ గా అదరగొట్టాడు. ముఖ్యంగా తన డైలాగ్ డెలివరీ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. మహేష్ బాబుకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఇమేజ్ వల్ల ఈ సినిమా ఖచ్చితంగా భారీ వసూళ్ళని నమోదు చేస్తుంది. మహేష్ బాబు ఫ్యాన్స్ నిన్నటినుంచే థియేటర్ ల దగ్గర ఏ హీరోకి చెయ్యనంత హడావుడి, సెలెబ్రేషన్స్ చేస్తున్నారు.సినిమా ఎలా ఉన్నా మహేష్ ఒంటి చేత్తో హిట్టు చేయగల సామర్ధ్యం ఉన్న నటుడు. ఈ సినిమాలో కొత్త మహేష్ ని చూస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: