గుంటూరు కారం రివ్యూ: మహేష్ కేక.. రీమేక్ కి విజయ్ రెడీ?

Purushottham Vinay
టాలీవుడ్ టాప్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంకా యంగ్ బ్యూటీ శ్రీ లీల జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఫై చిన్నబాబు నిర్మించిన సినిమా గుంటూరు కారం.సంక్రాంతి పండుగ కానుకగా నేడు (జనవరి 12) వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున ఈ సినిమా రిలీజ్ అయ్యింది. గతంలో త్రివిక్రమ్ - మహేష్ కలయికలో అతడు , ఖలేజా చిత్రాలు వచ్చి ప్రేక్షకులని ఎంతగానో అలరించగా..ఇప్పుడు మూడో సారి వీరిద్దరి కాంబో లో సినిమా వస్తుండడం తో మొదటి నుంచే అంచనాలు రెట్టింపు అయ్యాయి. సినిమా తాలూకా ప్రమోషన్ కార్యక్రమాలు పెద్దగా జరగకపోయినా సినిమాను మొదటి రోజు మొదటి షో చూడాలని సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ తహతలాడారు.నిన్న అర్ధరాత్రి నుండే ఈ సినిమా సందడి మొదలైంది. హైదరాబాద్ లో అర్ధరాత్రి 1 గంటకే షోస్ మొదలుకాగా..మిగతా చోట్లా ఉదయం 4 గంటల నుండి ఈ సినిమా షోస్ ప్రారంభమయ్యాయి. ఇక సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఒకే టాక్ ను వ్యక్తం చేస్తున్నారు.అదే సూపర్ స్టార్ మహేష్ వన్ మాన్ షో. సూపర్ స్టార్ సినిమాని ముందుకు నడిపించారు అని చెపుతున్నారు.


 యాక్షన్ , డాన్స్ , డైలాగ్స్ ఇలా ప్రతి దాంట్లో కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు న్యాయం చేసాడని , శ్రీ లీల తన డాన్స్ తో మరోసారి అదరగొట్టింది అని చెపుతున్నారు. త్రివిక్రమ్ కూడా ఒక కమర్శియల్ మాస్ సినిమా ఎలా తీయాలో అలా తీశాడు. కాకపోతే కొన్ని చోట్ల మాత్రం బోరింగ్ సన్నివేశాలు , స్లో నేరేషన్ అనేవి కాస్త ఇబ్బంది పెట్టిందని అంటున్నారు. ఇక థమన్ రొట్ట కొట్టుడు గురించి తెలిసిందేగా. మీనాక్షి చౌదరి ఎందుకుందో త్రివిక్రమ్ కే తెలియాలి. రమ్య కృష్ణ, జగపతి బాబుని సరిగ్గా వాడుకోలేదు. ప్రకాష్ రాజ్ ఎప్పటిలాగే ప్రాణం పెట్టి తన పాత్రకి న్యాయం చేశాడు. సినిమాని కేవలం మహేష్ కోసం చూడవచ్చు. ఆయన పెర్ఫార్మన్స్ మాత్రం సూపర్ గా ఉంది. మొత్తానికి ఫ్యాన్స్ కి ఇష్టం కలిగే రీతిలో మహేష్ ని చూపించాడు.గుంటూరు కారం పక్కా మహేష్ వన్ మ్యాన్ షో..అందుకే ఈ సినిమాని తలపతి విజయ్ తమిళ్ లో రీమేక్ చెయ్యాలని భావిస్తున్నాడు. ఈ సినిమాలో మాస్ లుక్స్ కి పెర్ఫార్మన్స్ కి ఫిదా అయిన విజయ్ ఈ సినిమాని రీమేక్ చెయ్యాలని చూస్తున్నాడని సమాచారం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: