లెఫ్ట్ నుండి ప్రభాస్.. రైట్ నుండి మహేష్.. ఈ కుర్రాడి ఎంట్రీ ఎప్పుడో?

praveen
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల ఫ్యామిలీల నుంచి ఎంతో మంది వారసులు ఇండస్ట్రీకి పరిచయం అవ్వడం చూస్తూ ఉంటాం. అయితే ఇక ఇప్పుడు ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి ఒక వారసుడు ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని అభిమానులు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారసుడు అనగానే మహేష్ బాబు తనయుడు గౌతమ్ అనుకునేరు. అతని ఎంట్రీ గురించి ప్రస్తుతం ఫాన్స్ ఆలోచించడం లేదు. కానీ మరో కుర్రాడి ఎంట్రీ గురించి తెగ వెయిట్ చేసేస్తున్నారు అభిమానులు. అతని పేరు చరిత్ మానస్.

 ఈ పేరు పెద్దగా సినీ జనాలకు తెలియకపోవచ్చు. కానీ మహేష్ బాబు ఫ్యాన్స్ కి మాత్రం ప్రత్యేకంగా ఇతని గురించి చెప్పాల్సిన పనిలేదు. మహేష్ సోదరీ ప్రియదర్శిని హీరో సుధీర్ బాబు పెద్ద కుమారుడే చరిత్ మానస్. గతంలో ఒక సినిమా ఈవెంట్లో పాల్గొన్న చరిత్ మానస్ మహేష్ బాబు బాడి లాంగ్వేజ్ తో కనిపించి కెమెరాల దృష్టిని ఆకర్షించాడు అని చెప్పాలి. అయితే అచ్చు కుదిరినట్లు మేనమామ మహేష్ బాబు లాగే ఉండడం, మహేష్ లాగే నడక, యాటిట్యూడ్ కూడా ఉండడంతో సినీ జనాల కాన్సన్ట్రేషన్ మొత్తం ఇతనిపై పడిపోయింది. ఇక హైట్ లో ప్రభాస్ ని గుర్తు చేస్తున్నాడు చరిత్ మానస్.

 ఇలా లెఫ్ట్ నుంచి ప్రభాస్ లా రైట్ నుంచి మహేష్ బాబు లా కనిపిస్తున్న ఈ కుర్రాడు హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడ అని ఘట్టమనేని అభిమానులు మాత్రమే కాదు సాదరణ సినీ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక చరిత్ మానస్ ఎక్కడ కనిపించినా కూడా అతనికి ఇదే ప్రశ్న ఎదురవుతుంది. అయితే సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు చరిత్ మానస్ సిద్ధమవుతున్నాడని.. కానీ కాస్త సమయం పడుతుందని.. గతంలో సుధీర్ బాబు ఒక సినిమా ఈవెంట్ లో చెప్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: