ఎట్టకేలకు తన గ్లామర్ సీక్రెట్ ఏంటో రివీల్ చేసిన మహేష్ బాబు..!?

Anilkumar
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ సినిమా గుంటూరు కారం. కాగా ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఈ నేపథయంలో ప్రమోషన్స్ కార్యక్రమాలను సైతం వేగంగా చేసే పనిలో ఉన్నారు మేకర్స్. ఇటీవల న్యూ ఇయర్ సందర్భంగా మహేష్ బాబు దుబాయ్ వెళ్ళాడు. ప్రస్తుతం తన వెకేషన్ పూర్తిచేసుకుని గుంటూరు కారం సినిమా ప్రమోషన్స్ లో బిజీ కాబోతున్నారు మహేష్ బాబు. ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మహేష్ బాబు తన వ్యక్తిగత విషయానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.


 అయితే కెరియర్ మొదట్లో నా సినిమాలు పెద్దగా ఆడేవి కాదు అని.. కృష్ణ గారి అబ్బాయి అంటూ నాపై ఒత్తిడి చాలా ఎక్కువగా ఉండేది అని.. అంతేకాదు అందుకే రెమ్యూనరేషన్ కోసం ఆలోచించకుండా సినిమాను చేసేవాడిని అని.. ఒక్కడు సినిమా తర్వాత నాకు ధైర్యం వచ్చింది అని వెల్లడించాడు మహేష్ బాబు. నేను నా సర్కిల్లో పూర్తిగా వేరుగా ఉంటానని.. నవ్వుతూ, కబుర్లు చెబుతూ సరదాగా గడుపుతానని చెప్పుకొచ్చాడు. ఇక్కడ నేను ఫ్రీ గా తిరగలేను అందుకే విదేశాలకు తరచూ వెళ్తూ ఉంటానని విదేశాలకు వెళ్లి వచ్చిన తర్వాత నేను ఫుల్ గా రీచార్జ్ అయినట్టు ఫీల్ అవుతానని ఈయన తెలిపారు.


ఇక నాన్నను చూస్తూ పెరగటం వల్ల నాలో కూడా అదే క్రమశిక్షణ వచ్చిందని ఈయన వెల్లడించారు.  నేను ఎప్పుడూ సరదాగా నవ్వుతూ ఉంటాను అదే నాకు గ్లామర్ సీక్రెట్ అంటూ మహేష్ బాబు ఈ సందర్భంగా తన గ్లామర్ సీక్రెట్ ఏంటో కూడా బయటపెట్టారు. నా బెస్ట్ ఫ్రెండ్ నా భార్య నమ్రత అని నాకు నచ్చే ట్రిప్ యూరప్ నచ్చే కలర్ బ్లూ కలర్ అంటూ కూడా తన విషయాలన్నింటినీ మహేష్ తెలిపారు  మురారి సినిమా విడుదల సమయంలో నాన్నతో కలిసి నేను థియేటర్ కి వెళ్ళాను ఆ సమయంలో ప్రేక్షకులను నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందోనని టెన్షన్ పడుతూ ఉన్నాను కానీ నాన్న మాత్రం నా భుజంపై చెయ్యి వేశారు.. అంటూ చెప్పుకొచ్చారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: