టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ లలో రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఒకరు. ఈయన తన కెరియర్ లో ఎన్నో సినిమాలకు సంగీతాన్ని అందించాడు. అలాగే ఈయన సంగీతం అందించిన ఎన్నో సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకున్నాయి. అలాగే కొన్ని కొన్ని సినిమాలను ఈయన తన సంగీతంతో విజయాల వైపు తీసుకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక అద్భుతమైన క్రేజ్ ను సంగీత దర్శకుడు గా ఏర్పరచుకున్న ఈయన పోయిన సంవత్సరం కేవలం వాల్టేరు వీరయ్య అనే సినిమాతో మాత్రమే ప్రేక్షకులను పలకరించాడు. పోయిన సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. అలాగే దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు అందించిన సంగీతానికి గాను ఈయనకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి.
పోయిన సంవత్సరం కేవలం ఒక సినిమాతో ప్రేక్షకులను పలకరించిన దేవి శ్రీ ప్రసాద్ ఈ సంవత్సరం మాత్రం చాలా సినిమాలతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ గా ఉన్నాడు. ఈ సంవత్సరం విడుదల కాబోయే పుష్ప పార్ట్ 2 మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే కాంగువ , ఉస్తాద్ భగత్ సింగ్ , రత్నం అనే సినిమాలకు కూడా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలు అన్నీ కూడా ఈ సంవత్సరం విడుదల కాబోతున్నాయి. ఈ అన్ని మూవీ లపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ లలో కొన్ని మూవీల ఆల్బమ్ లు సూపర్ హిట్ అయినా కూడా దేవి శ్రీ ప్రసాద్ పేరు ఇండియా వైడ్ గా మారు మోగే అవకాశాలు ఉన్నాయి.